ప్రాతూరి శాస్త్రి - 22.09.2020.....           22-Sep-2020

త్యాగధనులు శ్రమసంస్కృతి ఫలితమే తరిగోపుల ప్రాంగణం

స్వచ్ఛ సైనికుల శ్రమదాన కృషి ఈ డంపింగ్ యార్డు.

           1000 రోజుల ఉత్సవానికి దాదాపు 26 రోజులు ఉదయం, సాయంత్రం సేవజేసి డంపింగ్ యార్డుకు నూతన శోభ సంతరించారు.

            డంపింగ్ యార్డులో ఉద్యానవనాలు నవీకరించబడ్డాయి.

            శ్మశానానికి సరిహద్దుగా bamboo plants నాటారు.

            కన్న కలలు సాకారం చెందుతుంటే ఎంత ఆనందమొగదా.

            Renovation of

            Dumping yard     

            అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 212018 లో వస్తున్నారని వార్త కార్యకర్తలలో ఆనందం కలిగింది.

            డా. పద్మావతి గారు డంపింగ్ యార్డు నవీకరించదలచారు. చెత్త సంపద కేంద్రానికి రంగులేశారు.

            దాని ముందున్న ఉద్యానవనం రూపురేఖలు మారిపోయాయి.   

            నాలుగు వైపులా ఇసుకతిన్నె వలె ఏర్పాటుజేసి lawn వేయించారు.

            తూజా, క్రోటన్, చుట్టూతా బంతి మొక్కలు, కుండీలలో గులాబీలు నాటడంతో నందనవనంలా మారిపోయింది.

             కలెక్టర్ లక్ష్మీకాంతం గారు, 500మీ సిమెంటు రోడ్డు వేయించారు. అంతే కాదు చెత్త సంపద కేంద్రం వెనుక భాగం కూడా lawn, బంతి మొక్కలతో మెరిసింది.

             21 న సీఎం రాక. కార్యకర్తలు 20 వ తేదీన రాత్రి గూడా సేవచేశారు. డా. పద్మావతిగారు lawn, పూలమొక్కలకు నీరు పోశారు. పేవరు టైల్స్ పైకి వచ్చిన నీటిని కార్యకర్తలు గుడ్డలతో తుడిచి, పిండి బకెట్లతో పారబోశారు.

            మిగిలిన కార్యకర్తలు చెత్త సంపద కేంద్రం పరిసరాలు శుభ్రంచేశారు.

            21.11.2018 a remarkable day of challapalli.

            ఆరోజు ఉదయం గూడా డంపింగ్ యార్డులో తుది మెరుగు దిద్దారు.

            ఈ. ఓ గారు గూడా వారం రోజులు కార్యకర్తలతో పాటే వున్నారు. కలెక్టర్ గారి పుణ్యమాయని చిల్లలవాగు రెండవ గట్టుకి రివిటింగ్ గూడా చేశారు.

            సీఎం గారిని మీరేమైనా అడుగుతారా అని కలెక్టర్ గారు అడుగగా,

            సీఎం గారితో ఫోటో దిగాలనేది కార్యకర్తల కోరిక అని తెలిపారు.

            కార్యకర్తలు దాదాపు 200 మంది వచ్చారు. ఆసుపత్రి సిబ్బంది, ఇరుగుపొరుగు స్వచ్ఛ గ్రామాల కార్యకర్తలు వచ్చారు. మాటమేరకు ఎవరూ కట్ట మీద నుండి దిగలేదు.

              సీఎం గారి మాటలలో "ఇంత పెద్ద చెత్త సంపద కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ చూడలేదనీ, డాక్టరు దంపతుల లాంటివారు కనీసం మండలానికొక్కరున్నా మన రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్ర గా మారుతుందని పలికారు.

చెత్త వేయని రహదారులు

పుష్ప సోయగాల సౌరభాలు

మరోపక్క నీడ నిచ్చు చెట్లు

వెలగట్టలేని స్వచ్ఛ సైనికుల సేవ

ముఖ్యమంత్రి గారి ప్రశంసలు

ధన్యత పొందిరి కార్యకర్తలు.

స్వయంగా ముఖ్యమంత్రి గారే చాలా బాగా ఉందంటే

1472 రోజుల సేవను మెచ్చుకుంటే

కార్యకర్తలలో కార్యకర్తయి అందరితో కలసి ఫోటో దిగితే

ఇన్నిరోజుల అలసట మటుమాయమైంది.

            డాక్టర్ దంపతులు వంటి వారు ప్రతి నియోజకవర్గంలో ఉంటే మన రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయన్నారు. వారి సంకల్పానికి తగిన కార్యకర్తలు లభించి ఇంత సుదూర సేవా ప్రయాణం చేయడం ఆనందకరం. 

         డాక్టర్ శివప్రసాదుగారు వారి సతీమణి జ్ఞాపకర్ధం వర్షాకాలంలో ఇబ్బందిపడకుండా మహాప్రస్థానం నిర్మించడానికి ట్రస్టుకి విరాళం ఇవ్వగా డాక్టరు గారి సతీమణి పేర నిర్మించారు.

            మొదటి 3 సంవత్సరాలు డంపింగ్ యార్డు గానే వ్యవహరించారు.

            వర్మీ కంపోస్టు తయారీ ప్రారంభమైంది.

            పంచాయతీ వారి సహకారం కూడా ఉండేది. ఆనాటి నుండి చెత్త సంపద కేంద్రమైంది.

            వర్మీ ఎరువు తయారీ ప్రారంభమయ్యింది. ఎరువు తయారీకి పేడ ఇచ్చిన పడమటి వీధిలోని రైతులకు ఉచితంగా వానపాముల ఎరువును జన్మభూమి ఉత్సవంలో ఇచ్చినారు.

            2019 లో డా. పద్మావతి గారి పితృవర్యుల మరణానంతరం తండ్రి పైని వాత్సల్యంతో డంపింగ్ యార్డు ఆధునీకరణ చేపట్టారు.

            దుబాయ్ లోని పార్క్ గేట్ నమూనాగా డంపింగ్ యార్డు ముఖద్వారం ఏర్పాటయ్యింది.

            గేటు బయట గూడా ఉద్యానవనం దానిముందు ఓ చతుర్భుజి ఆకృతి పై తరిగోపుల ప్రాంగణం అని సుందరాక్షరాలు లిఖించబడ్డాయి.

            డంపింగ్ యార్డు, చెత్త సంపద కేంద్రంగానూ, తదనంతరం తరిగోపుల ప్రాంగణం గా మారి చల్లపల్లి కే కాదు ఈ మండలానికే,

            కాదు కాదు దివిసీమకే కాదేమో

            కృష్ణాజిల్లాకే తలమానికంగా మారింది.

            అందుకేనేమో కలెక్టర్ లక్ష్మీకాంతం గారు పై నుండి ఉద్యానవనాల ఏరియల్ చిత్రాన్ని వారి టేబుల్ పై అలంకరించుకున్నారు.

- ప్రాతూరి శాస్త్రి

22.09.2020.