ప్రాతూరి శాస్త్రి - 16.10.2020.....           16-Oct-2020

 "స్వచ్ఛ భారత్ కోసం అడుగు వెయ్యరా

పరిశుభ్రత కోసం బాట వేయరా."

స్వచ్ఛతా నడక - ఘంటసాల

                     .....

1762 వ రోజు సుందర చల్లపల్లి 08.09.2019

 

ఈరోజు గ్రామ ప్రగతిలో స్వచ్ఛసేవకులు ఈనాటి సేవాయజ్ఞం స్వచ్ఛతా నడక.

నెలకొక్కసారి ఒకవూరికి నడకగా వెళ్లి అచట సేవ చేయాలని సంకల్పించారు.

ఉదయం 4 గం. 60 మంది పద్మావతీ ఆసుపత్రికి చేరారు.

గ్రూప్ ఫొటో దిగి స్వచ్ఛ నినాదాలతో స్వచ్ఛతా నడక సాగించారు ఘంటసాల వైపు .

రామానగరంలో ఘంటసాలకు తిరుగు మలుపు, పుచ్చగడ్డ, పెదలంక వద్ద మరింతమంది కార్యకర్తలు నడకలో పాల్గొన్నారు

దేవరకోట వద్ద ఘంటసాల కార్యకర్తలు స్వాగతం పలికి ముందుకుసాగారు.

ఘంటసాలలో కార్యకర్తలు మొక్కలు నాటారు. జలదీశ్వరస్వామి గుడి పరిసరాలు శుభ్రం చేశారు

ఘంటసాల రధసారధి గొర్రెపాటి సురేష్ గారు స్వచ్చతా నడకను గూర్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.   

స్వచ్చ చల్లపల్లి, స్వచ్చ ఘంటసాల కార్యకర్తల నినాదాలతో స్వచ్ఛతా నడక జయప్రదమైంది.

అనంతరం అల్పాహార స్వీకరించారు.

- ప్రాతూరి శాస్త్రి

16.10.2020.