ప్రాతూరి శాస్త్రి 18.10.2020. ....           18-Oct-2020

 స్వచ్చ సుందర చల్లపల్లె మన చల్లపల్లి

             Doctor of Roads

          డా.గంగాధర్ తిలక్ కాట్నం

కాట్నం గంగాధర్ తిలక్ గారు,. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రద్దీ రహదారులపై ఎక్కడ గుంటలు కనిపించినా పూడ్చి , పది సంవత్సరాలుగా ఈనాటికి 1610 గుంటలు పూడ్చడం జరిగింది. హైదరాబాద్ రోడ్ల డాక్టర్ గా పిలవబడే వీరు తాము ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, శ్రమదానం మొదలుపెట్టి పది సంవత్సరాలు పూర్తి అయింది. 

వీరు పచ్చదనం కోసం , తన ప్రాంత అభివృద్ధి కోసం ఏ లాభాపేక్ష లేకుండా శ్రమిస్తున్న తీరు శ్లాఘనీయం .

అందుకే వీరిని " స్టార్స్ ఆఫ్ ఇండియా" 60 మందిలో ఒకరిగా ఎంపిక చేసిన స్టార్ టి.వి అమితాబ్ బచ్చన్ గారి చేతిమీదుగా విలువైన కారు బహుమతిగా అందించారు.

ఆ కారును కూడా శ్రమదానానికి వాడుతూ ఇంకా శ్రమిస్తున్న "గంగాధర తిలక్" పుణ్య దంపతులకు పాదాభివందనం.

వారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే.

           ఇటువంటి మహోన్నత వ్యక్తి ప్రతిరోజూ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా పరిశీలిస్తుంటారు.  ఫేస్ బుక్ ద్వారా సుపరిచితం.

డాక్టర్ డీ ఆర్కే ప్రసాదుగారిని ఫోన్ ద్వారా నవంబర్ 24, 2019 న చల్లపల్లి వస్తున్నట్లు చెప్పారు.  ఫేస్ బుక్ లోను పోస్టింగ్ చేశారు.

          హైదరాబాదులో రోడ్లలోని గుంటలు పూడుస్తూ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఆచాటి గుంటలు ఆయా ప్రాంతపు విద్యార్థులతో గానీ, కార్యకర్తలతోగానే కార్యక్రమం నిర్వహించేవారు.

     23.9.2019 రాత్రికే చల్లపల్లి విచ్చేసి power point presentation  చూసారు.

 ఉదయం కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ రోడ్ల డాక్టరు గారు చల్లపల్లి లోని రహదారుల గుంటలు  డా.డీఆర్కేప్రసాదుగారు, డా.పద్మావతి గారు , కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గార్లు అందరి సమక్షంలో హైదరాబాద్ నుండి ప్లాస్టిక్ బాగ్ లలో తెచ్చిన తరు, కంకర మీక్సింగ్ తో ఎలా పూడ్చలో తెలుపుతూ కార్యకర్తలతో చేయించారు.

    యన్ టీ ఆర్ పార్క్ ఎదురుగా ఉన్న గుంట, నడకుదురు రోడ్డులో గుంటలు రోడ్డు మిక్స్ తో పూడ్చారు.

         అలుపెరుగని ఈ డా.తిలక్ గారి పని వేగం, సంభాషణలు, పరుల మేలు కోసం వారు పడే తపన, వినీతన ఆలోచనాశైలి, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకాలు.

  స్వచ్ఛ సుందర చల్లపల్లి పై  డా.తిలక్ గారి అభిప్రాయం

        ఫేస్ బుక్  లో ఇలా ప్రస్తావించారు.

స్వచ్చ భారత్ కార్యక్రమములు

ఒక మహాయజ్ఞం లాగ తలపెట్టి , పండుగలు అనే నెపముతో

పని ఆపకుండా , ఆ పర్వ దినాలలో కూడా మరింత వుత్సాహము గా  

దివిసీమలో, ఆవనిగడ్డ నియోజక వర్గం లో  ప్రతి మండలమూ

స్వచ్చ భారత్  నిర్వహిస్తున్న తీరు బహు  ప్రసంశనీయము.

 

ఈ గ్రామాలలో  ప్రజలు మన రాష్ట్రములో అన్ని గ్రామాలకు ఆదర్శము.

మనకు వున్న సహజ వనరులను  సద్వినియోగము చేసుకొంటూ 

ముందుకు సాగితే మన దేశము ప్రపంచము లోనే అగ్రగామి కాగలదు.

అన్నింటినీ మించిన యువశక్తి దేశ జనాభా మన సహజ వనరులలో అతి విలువైనవి. 

 

ఆడుతూ పాడుతూ పని చేసుకొందాము. కలసి కదలండి .

 కలసికట్టుగా వుండి వూరుకి వుపయోగ పడే పని చేసుకొంటూ   

 ప్రశ్నించ వలసిన వారిని ప్రశ్నించుతూ, ప్రగతి మార్గములో పయనిద్దాము

ప్రాతూరి శాస్త్రి

18.10.2020

 

డా. డీఆర్కే గారి ప్రతిస్పందన                     

తిలక్ గారూ

చాలా సంతోషం.

మీలాంటి వారి వద్దనుండీ ప్రశంసలు అందుకోవడం .

స్వచ్ఛ కార్యకర్తలందరి తరుపునా ధన్యవాదాలు.

డా. డి.ఆర్.కె.ప్రసాదు

18.10.2020