అమేయ దీక్షా దక్షులకు నా.......           30-Apr-2020

ఎండ – వానకు, చలికి – మంచుకు, తుఫానులకూ- ప్రమాదాలకు

నిందలకు – అభినందనలకూ, పడగ ఎత్తిన కరోనాలకు

బెదరకుండ సుదీర్ఘకాలం గ్రామ బాధ్యత నిర్వహించిన

త్యాగధనులకు వందనమ్ములు – అకుంఠిత సుమ చందనమ్ములు!