ఏక దీక్షా దక్షులకు నా.......           29-Apr-2020

ఎవరు మెచ్చిన – అడ్డు నిలిచిన – అభూతకల్పన లెన్ని చేసిన
ఏక దీక్షగ ఊరి మేలుకు సుదీర్ఘ కాలం చెమట చిందిన –
లాభరహితంగా శ్రమించిన – లక్ష్య దిశగా ఉరక లెత్తిన
త్యాగధనులకు ప్రణామంబులు - స్వచ్చ సంస్కృతి చందనమ్ములు!