ప్రాతూరి శాస్త్రి - 08.11.2020. ....           08-Nov-2020

 స్వచ్ఛ అమృతలూరు

 

నిన్న సాయంత్రం గుంటూరు జిల్లా అమృతలూరులో స్వచ్ఛ అమృతలూరుసాధన గురించి అక్కడ ప్రజలతో ఒక సమావేశం జరిగింది. గతంలో అమృతలూరు మండలాధ్యక్షులుగా పనిచేసిన రత్న ప్రసాద్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామ సర్పంచ్ హాజరైన ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా ప్రజలు హాజరైనారు. ఈ సమావేశంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా రావడం విశేషం.

 

స్వచ్ఛ సుందర చల్లపల్లిపై ఫోటో ఎక్జిబిషన్ ఏర్పాటు చేశాము. స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యక్రమ విశేషాలన్నింటిని వివరించటం జరిగింది. కార్యకర్తల నిస్వార్థ సేవా నిరతి, సమిష్టి కృషి, ఫలితాలను ఆశించకుండా కృషి చెయ్యడం, పరిశుభ్రత-పచ్చదనం-సుందరీకరణలపై విపులంగా వివరించడం జరిగింది. నాతో పాటు మన స్వచ్ఛ కార్యకర్తలు డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు, గంధం బృందావన్, వేల్పూరి దుర్గాప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు.

 

శ్రీమతి శాంత కుమారి గారు (రిటైర్డ్ టీచర్) ఆ గ్రామంలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. వారి భర్త భాస్కర రావు గారు, రత్నప్రసాదు గారు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బహిరంగ మలవిసర్జన, క్యారీబ్యాగులు, బ్రాందీ సేసాలతో కూడిన చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉండటం వారి సమస్యలుగా వారు చెప్పారు. వీటన్నింటినీ శుభ్రం చెయ్యటమే కాక మొక్కలు నాటటం, వాటిని సంరక్షించటం కూడా చేస్తున్నారు. వారు చేసే కార్యక్రమం చాలా గొప్పదని, ఫలితాలను ఆశించవద్దని, ప్రజలు కలిసి రావడం లేదని దిగులుపడకుండా ఆశావాదంతో ఉండటమే మన కర్తవ్యంఅని చెప్పటం జరిగింది.

 

అనంతరం వారందరినీ స్వచ్ఛ సుందర చల్లపల్లివచ్చి మన కార్యకర్తల స్వచ్ఛ సేవను చూసి వెళ్లవలసినదిగా ఆహ్వానించాము.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

19-10-2017

 

- ప్రాతూరి శాస్త్రి

08.11.2020.