ప్రాతూరి శాస్త్రి - 12.11.2020 ....           12-Nov-2020

 ## అంతం కాదిది ఆరంభం##

ఉద్యమానికి అంతం లేదు అందునా స్వచ్ఛ సుందర చల్లపల్లి మహోద్యమం, శ్రమజీవన సౌందర్యం నేర్పిన ఉద్యమం, శ్రమసంస్కృతిని దేశానికి చాటిన ఉద్యమం.

2000 రోజులు నిర్విరామంగా, అలుపెరగక శ్రమించి త్యాగధనులైన ఉద్యమం ప్రయత్నించి ప్రజల ఆలోచన, అలవాట్లు, జీవనము,అవగాహన మార్చగలిగిన మహోద్యమం, నమస్కారాలు, విజిల్స్, టార్చ్ లైట్లు, చేతిలో కర్ర లతో ఉద్యమ విజయానికి బీజం పడిన ఉద్యమం,

చెత్తపై సమరము జేసి,, నలుదిశలా హరితవనాలు ఏర్పాటుతో మిగిలిన గ్రామాలకు స్ఫూర్తినిచ్చిన ఉద్యమం, డా. గురవారెడ్డి, శ్రీ యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు, అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారి వంటి మహామహులను ఆకర్షించి, మెప్పించిన ఉద్యమం, ప్రజావైద్యులు డా. గోపాళం శివన్నారాయణ గారు సతీసమేతంగా విచ్చేసి కార్యకర్తలకిచ్చిన స్పూర్తితో నూతన ఆలోచనలను కలిగించగా నవచైతన్యం పొందిన మహోద్యమం,

జాతీయ, రాష్ట్ర వేదికలపై జయకేతనం ఎగురవేసి, స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనలో అందరినీ భాగస్వామ్యం చేసిన మహోద్యమం, ఇటువంటి మహోద్యమలకు అంతం లేదు ఎప్పటికప్పుడు ఆరంభమే.

స్వచ్ఛ సుందర చల్లపల్లి చక్కదనంబెన్న

 నలువరాణికైన నలవికాదు, అన్ని

 కళల లోన ఆరితేరిన జాణ

 స్వచ్ఛ భారతాంబ , స్వాగతం.

- డా.గుడిసేవ విష్ణుప్రసాద్.

శాంత మతిన సాధించే మన డీఆర్కే

సాహసముతోడ వసుంధరా పురస్కారి

త్యాగ నిరతి తోడ నిస్వార్థ సేవకులు

స్వచ్ఛ సుందర చల్లపల్లి ని నిక్కముగాను.

అలుపెరుగని శ్రామికులకు శతాధిక వందనములు

శ్రమను శ్రమ అనుకోక ఇష్టంగా పనిచేయు కార్యకర్తలకు నమస్సులు,

అపర భగీరధులు పద్మావతీప్రసాదులకు

సుందర చల్లపల్లి ప్రోత్సాహకులకు

సహస్రాధిక వందనములు.

శతం జీవ శరదో వర్ధమానః

భవతి శతమితి శతం

దీర్ఘంమాయుః.

నేనజ్ఞానుడ, సుజ్ఞానుల సాంగత్యం నేర్పే రవ్వంత,

శంక పట్టకండి శాస్త్రజ్ఞుడను గాను

వంక పెట్టకండి నేనేవరికి వైరినిగాను

తప్పులెన్నకండి  త్యాగధనులార.

మనసునిల్పి విషయము తెలియండి

ఈ సంకలనానికి సహాయ సహకారాలు అందించిన ప్రసాద్ వేల్పూరి, షర్మిల, లక్ష్మి సెల్వం గార్లకు అభినందనలు.

#స్వచ్ఛ సుందర చల్లపల్లి పరాచక్షువు# ప్రధమ భాగం సంతృప్తికరంగా ఈ సంకలనాన్ని పూర్తి చేయించిన డా.పద్మావతి గారు, డా. డీఆర్కేప్రసాదుగార్లకు హృదయపూర్వక నమస్సులు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి యను పరాచక్షువు 2 వ భాగంతో మరల త్వరలో.....

జై స్వచ్ఛ సుందర చల్లపల్లి జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లి

- ప్రాతూరి శాస్త్రి

   12.11.2020