04.07.2020....           04-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

04.07.2020 వ నాటి ప్రయత్నాలు!

 

            నేటి వేకువ ఎడతెగని వర్షకారణంగాను, ముందే కార్యకర్తల సమిష్టి నిర్ణయానుగుణంగాను 30 దినాల స్వచ్చోద్యమ విరామ నిబంధన వల్లనూ పాగోలు రోడ్డులో పూల మొక్కలు, చెట్లు నాటవలసిన కార్యక్రమం జరగలేదు.

 

            ఇద్దరు కార్యకర్తలు మాత్రం పాగోలు, పెదకళ్లేపల్లి మార్గాలను పరిశీలించి, ఎక్కడెక్కడ చెట్ల, పూల మొక్కల లోటు ఉన్నదో లెక్కించి, ఏయే జాతుల మొక్కలనెక్కడ ఎన్ని నాటవలెనో లెక్క తేల్చారు.

 

            ఈ కార్యకర్తల నిబద్ధతనే అందరూ గమనించవలసింది. తమ గ్రామ స్వచ్చ శుభ్ర సుందరతా ప్రణాళికను ఆచరణలో పెట్టడంలో వారి తపనే ఇక్కడ గమనార్హం.

 

            పాగోలు బాటలో నేడు జరగవలసిన హరిత సుందరతా శ్రమదాన కార్యక్రమం రేపటికి వాయిదా పడిందనీ, రేపటి వేకువ 4.00 కే అది జరుగుతుందనీ గమనించగలరు!

 

         ప్రత్యంగుళ స్వస్తత కై....   

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనిన

సామాజిక ఋణం తొలగు తాత్త్వికతే పునాదిగా

అసాధ్యమని శంకింపక అతి విశాల గ్రామంలో

ప్రత్యంగుళ మణువణువూ స్వచ్చ స్వస్తపరచడం!

 

  - నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శనివారం 04/07/2020,

చల్లపల్లి