Daily Updates

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7...

                                        మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7 ఒకప్పుడు 50 ఏళ్ల క్రిందట చెర బండ రాజు అనే కవి “ విప్లవాలయుగం మనది- విప్లవిస్తె జయం మనదె..” అని మహోద్రేకంగా పాడుతూ ఉండేవాడు. అతని కవితలెంత వరకు యదార్థమో అతని స్వప్నాలెంతదాక ఋజువైనవో గాని... మన సమకాలం ముఖ్యంగా ఈ 21 వ శతాబ్దం ద్వితీయ దశకం మాత్రం సామాజిక పరిశీలకులకు  “ స్వచ్చోద్యమ యుగం మనది- ఉద్యమిస్తె జయం మనది....” అనిపించక మానదు. అటు 2014 ఆగస్టు 15 తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు గాని,...

Read More

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6 ...

 మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6              చల్లపల్లి లో 2013 లోనే అంకురించి, 2014 లో పుష్పించిన సామాజిక స్వచ్చ ఉద్యమాన్ని గాని, కాలక్రమాన ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాలను గాని, పరిశీలిస్తున్నపుడు – అక్కడక్కడ కొందరు వ్యక్తుల కాలుష్య నియంత్రణా కృషి, వాళ్ళ ఒంటరి పోరాట స్ఫూర్తి తళుక్కున మెరవడం గమనించవచ్చు. ఈ దేశంలోని పర్యావరణ ప్రమాదాలను శాశ్వతంగా తొలగించుకోవాలన్నా – విశాల ప్రజారోగ్య సాధనా సంకల్పం నెరవేరాలన్నా – అలాంటి సత్కార్యాచరణకు సంసిద్ధులం కావాలనుకొన్నా – మన సమకాలిక సంఘటనల్ని, స్ఫూర్తి ప్రదాతల్ని నిరంతరంగా గుర్తుకు తెచ్చుకోకతప్పదు! అశోకుడిలా చెట్లు నాటించిన గొప్పవారే కాదు – పర్యావరణ సమతుల్యత కోసం అరణ్యాలను కాపాడమేం ఖర్మ – ఒం...

Read More

మన కాలపు స్ఫూర్తి దాతలు – 5...

మన సమకాలంలో – ప్రత్యక్షంగా ఒంటరిగానూ, సామూహికంగానూ అన్ని కాలుష్యాల మీద కొందరు వ్యక్తులు చేస్తున్న అద్భుత సంగ్రామాలు చూస్తుంటే విప్లవ మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటే గుర్తొస్తున్నది.   “తూరుపు దిక్కున వీచే గాలి – పడమటి కడలిని పిలిచే గాలి తూరుపు పడమర లేకంచేసే తుఫానులా చెలరేగే దాకా.. భూమి కోసం – భుక్తి కోసం సాగే రైతుల పోరాటం అనంత జీవన సంగ్రామం...”   ...

Read More

మనకాలపు స్ఫూర్తి ప్రదాతలు - 4...

             మన కళ్లముందే కాలం ఎన్నెన్ని దుర్మార్గపు పోకడలు పోతుందో, దాని కడుపు నుండి ఇడీ అమీన్, అడాల్ఫ్ హిట్లర్ లాంటి రాక్షసులెందరు పుట్టుకొస్తారో, అదే గర్భం నుండి బుద్ధుడు – జీసస్ - గాంధీ వంటి దైవాంశ గల పుణ్య పురుషులు సైతం ఆవిర్భవించి, మానవ మాత్రుల్లోని రాక్షసాంశలను ఎలా దుంపనాశనం చేస్తూ పోతారో పరిశీలిస్తుంటే భలే విచిత్రంగా ఉంటుంది! ఇప్పటికిప్పుడు – ఈ శతాబ్దంలోనే మనం చూస్తుండగానే కాలమనే మహాక్షీర సముద్రం కడుపారకన్న ఒక అనర్ఘ మానవ జాతి రత్నమూ, స్వయం హననానికి పాల్పడుతున్న మనతరాన్ని బ్రతికించే అమృతభాండమూ గ్రేటాథన్ బర్గ్.               ఆమె పుట్టిందీ పెరిగిందీ స్వీడన్ అనే చిన్న దేశంలో. నేటి ప్రపంచపు కొల...

Read More

21.07.2020 - ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయం ఇదే...

       ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయం ఇదే...

Read More

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-3...

                                                       మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-3           2070 రోజుల నిరంతర సుదీర్ఘ శ్రమదాన చల్లపల్లిలో ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మలేనివీ, రోజూ చూస్తున్నపటికీ ఆశ్చర్యకరమైనవి కొన్ని దృశ్యాలను నోరు వెళ్లబెట్టి మరీ చూస్తుండే వాడిని. - వివిధ నేపధ్యాల ఇందరు వ్యక్తులొక శ్రమ శక్తి గా మారి క్రమం తప్పక వేల రోజులుగా గ్రామం మేలు కోసం కష్టించడం - అది కూడ గ్రామమంతా గాఢ నిద్రలో ఉండే వేకువ 4.00 నుండి 6.00 మధ్య జరగడం,...

Read More

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 2 ...

                          మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 2         మనలో చాలా మందిమి పౌరాణిక అద్భుత కధలను భలే మెచ్చుతాం! ఏ అవతార పురుషుడో దుష్ట - భ్రష్ట రాక్షసుల్ని దుంప నాశనం చేశాడనే (కల్పిత) కవిత్వాలను ఇష్టపడి బాగా ఆస్వాదిస్తాం. భగీరధుడు వంటి ఒక ఉత్తమ వంశ సంజాతుడు వాయిదాల పద్ధతిలో ఘోర భీకర తపస్సులు చేసి – చేసి స్వర్గంలో ఉండవలసిన గంగను – అమాంతం భూమి మీదకి – అందునా మన పవిత్ర భారతావనికి తెచ్చిన అద్భుత ఘట్టాలను ఒకరికొకరు చెప్పుకొని, సినిమాలుగా చూసుకొని (ఆ అతిలోకాద్భుత సాహసం వెనుక అతని స్వార్ధ లేశాన్ని పట్టించుకోక) మురిసిపోతాం! అంతటి గొప్ప ఆదర్శాలను ఆదర్శాలుగానే మిగిలిస్తూ – ఆచరణ జోలికి పోకపోవడం కూడ మనకు రి...

Read More

12/07/2020...

ఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.   (12.07.2020) వ అనగా – 2070*వ నాటి ఆదర్శం!               ఔను మరి – నా దృష్టిలో ఈ సుదీర్ఘ స్వచ్చోద్యమకారుల నిర్విరామ 2070 దినాల చల్లపల్లి గ్రామ స్వచ్చ – శుభ్ర – హరిత - సుందరీకరణ మహా ప్రయత్నం నిశ్చయంగా ఆదర్శమే! 20 - 12 – 2013 నాటి తొలి దశలోను, 12.11.2014 నాటి మలి దశ నిర్మాణాత్మక – నిస్వార్ధ శ్రమదాన ఉద్యమంలోను – ఉభయ దశల్లో అడుగడుగునా ఎదురైన కొందరు ...

Read More

11/07/2020...

ఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.   11.07.2020 వ నాటి శ్రమ సుందర జాడలు!               వర్షం చల్లపల్లి మీద మితిమీరిన ప్రేమను కురిపిస్తున్న నేటి వేకువ – అంతకన్నా ఎక్కువ అభినివేశమే ఉన్న స్వచ్చ కార్యకర్తలు అమరావతి రాజభవనం దగ్గరికి సకాలంలో చేరుకొన్నారు. కాని, గట్టి వర్షం ఆగే దాక – కొంత సమయం వేచియుండి – చిట్టి వానలోనే పనికి దిగి – 4.35 – 6.15 సమయాల నడుమ ఈ 18 మంది బృందం తన లక్ష్యాలను చేరుకొ...

Read More

10.07.2020...

 ఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.   10.07.2020 వ నాటి రహదారుల – పూదోటలు               నేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ కృతార్ధమైంది. వాస్తవానికిదంతా నిన్ననే జరగవలసిన పని. ఎడతెగని భారీ వాన నిన్నటి పూల మొక్కల స్థాపనావిధులకు అడ్డు తగిలి నేటికి బదిలీ అయింది!               ఈ 16 మంది గ్రామ సమాజ హితాభిలాషుల...

Read More

09.07.2020...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం. 09.07.2020               గత అర్ధరాత్రి నుండి పెళపెళ ఉరుములతో – తెరలు తెరలుగా భారీ వర్షం కురిసి కురిసి కలిగించిన అంతరాయం కారణంగా నేటి ఉదయం స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమానికి వెళ్ళడం కుదరలేదు. స్వచ్చ సైనికుల దగ్గర మిగిలిపోయిన కొద్దిపాటి పూల మొక్కలకు తోడు మూడు నాలుగు రకాల – సుమారు 300 పూల మొక్కలను తాతినేని రమణ గారి నుండి, ఇతర చోట్ల నుండి తెప్పించినవి ఇకపై స్వచ్చ చల్లపల్లి వివిధ వీధులలోనూ, క...

Read More
[1] 2 3 4 5 ... > >>