స్వచ్చ నాగాయలంక కార్యకర్తలకు అభినందనలు....

నిన్న జరిగిన స్వచ్చ నాగాయలంక 1600*వ రోజుల వేడుక లో ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఏవీ వాడలేదు.

- ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పైనే “1600*వ రోజు వేడుక” అని రాయించారు.

- మంచి నీళ్లకు ప్లాస్టిక్ సీసాలు గాని, ప్లాస్టిక్ గ్లాసులు గాని వాడకుండా రాగి గ్లాసులను వాడారు. వీటిలో నీళ్లు   పోయడానికి కూడా రాగి మగ్గులనే వాడారు.

-  పేపర్ కప్పులలో నే టీ అందచేశారు.

          స్వచ్చ ఉద్యమాల వేడుకలు, స్వచ్చ కార్యకర్తల ఇళ్లల్లో జరిగే వ్యక్తిగత వేడుకలలో ఇలా ఆచరించి చూపిస్తేనే సమాజం పై ప్రభావం ఉంటుంది. 

          ఇలా ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను మానివేసిన తరువాత వీలైనంత ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఉదాహరణకు ప్లాస్టిక్ మెమెంటోలు, ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు....

          స్వచ్చ నాగాయలంక కార్యకర్తలకు మరొక్క సారి అభినందనలు తెలుపుతూ....

దాసరి రామకృష్ణ ప్రసాదు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త

26.02.2020

స్వచ్చ నాగాయలంక 1600*వ రోజు వేడుక