29.04.2021....

 నీకు మా స్వచ్చోద్యమాంజలి

 

మౌనముగనే వేల గంటలు మనం మనకోసం సుమా’! అని

ఎవడు చేసెనో సొంత ఊరికి ఇన్ని వేల దినాల సేవలు

వీధి వీధిన దుమ్ము ధూళిని, మురుగు కాల్వల సిల్టుతో డెనొ

అతడె వాసన కృష్ణారావని అతని బ్రతుకాదర్శమేనని....

 

సు వాసనతో ఉన్న ఊరి స్వస్తతకు తగు నిబద్ధతతో

ప్రతి దినం రెండేసి గంటలు పాటుబడు ఒకమంచి బుద్దితొ

గ్రామ జనులకు ప్రేరకంగా, ప్రపంచానికి దార్శనికముగ

నిలిచి వెలిగిన కృష్ణరావూ! నీ కిదే స్వచ్చోద్యమాంజలి !

 

ఎవడు మాత్రం శిలాశాసనమనేంతగ జీవించగలడా?

ఇతని కన్నా చిత్త శుధ్ధితొ ఉన్న ఊరును కొలువ గలడా?

చదువు, ఆర్ధిక స్థితే తక్కువ స్వచ్ఛ సుందర స్పృహే ఎక్కువ

కృష్ణారావుకు సొంత గ్రామపు కీర్తి చంద్రికలందె మక్కువ!

 

ఔను నిజమే కరోనా పై అలసి ముగిసిన సమర మతనిది

సమాజం యెడ చెక్కు చెదరని స్వచ్ఛ బాధ్యత అతనికున్నది

వైద్య శాఖకు ప్రభుత్వాలకు అతని బాధ్యత ఎంత పట్టెను?

కోట్లు లక్షలు కుమ్మరించిన ఇంత బాధ్యుడు ఎచట దొరుకును ?

 

సోదర స్వచ్ఛ కార్యకర్తల తరపున -  

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

చల్లపల్లి.