1829 రోజుల స్వచ్చ చల్లపల్లి ఉద్యమం ....

  నవంబర్ 12, 2014 న స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టాము.

 

లక్ష్యాలుగా మేము ఎంచుకున్నవి

           గ్రామంలో-

                     పరిశుభ్రత, పచ్చదనం,సుందరీకరణ

ఇప్పటివరకూ1,82,900 గంటల శ్రమదానం జరిగినది.

ఈ లక్ష్యాల సాధనలో ఎంతవరకు వచ్చాం?

పచ్చదనం :

ఇప్పటివరకు ఏం చేశాం?

1.    వేల నీడనిచ్చే మొక్కలను, 20 వేల పూల మొక్కలను నాటి మనం సంరక్షిస్తున్నాం.

2.    రహదారి వనాలను ఏర్పాటు చేశాం.

3.    డంపింగ్ యార్డ్, శ్మశానం, బస్టాండ్ వంటి చోట్ల పచ్చగా చెట్లు పెరుగుతున్నాయి.

4.    ప్రతి రోడ్డు రెండువైపులా నీడనిచ్చే మొక్కలు, పూలచెట్లతో అందంగా ఉన్నాయి.

 

    సుందరీకరణ :

ఇప్పటివరకు ఏం చేశాం?

1.    రహదారి వనముల ఏర్పాటు,

2.    డంపింగ్ యార్డుల వలె ఉండే కొన్ని ప్రాంతాలను, పూల తోటలుగా మార్చడం,

3.    రహదారుల ప్రక్కన పూల మొక్కలు పెంచడం.  

4.    పేవర్ టైల్స్, రంగుల ఫెన్సింగ్ ల ఏర్పాటు

5.    ప్రహరీ గోడలకు రంగులు, పర్యావరణహితస్వచ్చతా నినాదాలు.

6.    పబ్లిక్ టాయిలెట్లకు అందమైన డిజైన్లు.

7.    సంతను, రైతు బజారును రంగులు వేసి అందంగా తయారుచేయడం. సంత బజారుకు వేసి సుందరీకరించడం.

 

ఇంకా ఏం చెయ్యాలి?

1.    Poster Free గ్రామంగా తయారుచెయ్యాలి.

2.    ఫ్లెక్సీ లు లేకుండా చెయ్యాలి.

3.    రోడ్ల ప్రక్కన కనిపించే ప్రాంతాన్ని ఇళ్ళుషాపులుఆఫీసులవారు అందంగా ఉంచుకునేటట్లు

       ప్రోత్సహించాలి, ఆవరణలలో మరింతగా పూల మొక్కలు పెంచేలా చూడాలి.

 

     పరిశుభ్రత

మా లక్ష్యాలు :

1.    బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తయారుచెయ్యడం.

2.    అవసరమైన చోట్ల పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడం.

3.    పంచాయితీ ద్వారా చెత్త నిర్వహణను శాస్త్రీయంగా నిర్వహించి Zero Waste management గ్రామంగా చెయ్యడం. 

4.    ప్రజలలో Solid waste management పై అవగాహన పెంచి తడిచెత్తపొడి చెత్త   

       విడివిడిగా చెత్త బండికి అందించేలా చెయ్యడం.  

5.    Liquid Waste management సక్రమంగా జరిగేటట్లు చూడడం, మురుగు నిల్వ

       లేకుండా చేయడం.

6.    ఊరంతా Under Ground Drainage ఏర్పడటం. 

 

      పరిశుభ్రత

ఇప్పటివరకు ఏం చేశాం?

1.    రెండు సంవత్సరాల క్రితమే (29.04.2017) బహిరంగ మలవిసర్జనరహిత

       గ్రామంగా (ODF) మన చల్లపల్లి ప్రకటించబడింది.

2.    NTR పార్కులో, నాగాయలంక రోడ్డులో రెండు అధునాతన టాయిలెట్లు మనం     

       నిర్మించి నిర్వహిస్తున్నాం. బస్టాండు లో RTC వారితో కట్టించడం జరిగింది.  

3.    గ్రామ పంచాయితీ, సంత వ్యాపారుల సహకారంతో సంతలో టాయిలెట్లను

       నిర్మించుచున్నాము.

4.    చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించి పంచాయితీకి అప్పగించాం.

5.    గంగులవారిపాలెం రోడ్డులోనూకమ్యూనిస్ట్ బజార్ రోడ్డులోనూ ప్రజల  

       భాగస్వామ్యంతో Under Ground Drainage(భూగర్భమురుగు పారుదల వ్యవస్థ)

       ఏర్పరచుకున్నాము.      

6   రెండు రోజులకొకసారి తమ బజారుకి చెత్త బండి వస్తే చెత్తను అందించడానికి ప్రజల్ని సంసిద్ధుల్ని చేశాం.

7.    స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల శ్రమదానంతో, గ్రామస్తుల, అధికారుల సహకారంతో

       చిల్లలవాగు ఒడ్డున స్మశానం, డంపింగ్ యార్డు ఏర్పడినవి.

 

ఇంకా ఏం చెయ్యాలి :

1.    పంచాయితీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చెత్త నిర్వహణ ఇంకా జరగవలసే ఉంది. ఆ

       ప్రయత్నం మొదలయ్యింది.

ఇది సమర్ధవంతంగా జరిగితే మా శ్రమ నూటికినూరుపాళ్లు ఫలించినట్లే.

2.    గ్రామంలో మరో రెండుచోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి.

కనీసం యూరినల్స్ అయినా నిర్మించాలి.

3.    గ్రామంలోని మిగిలిన డ్రైన్లన్నీ Under Ground Drainage లేదా Covered Drainage గా చెయ్యాలి.

4. Liquid Waste management – ఇది జరిగే అవకాశం కనుచూపు మేరలో లేదు. 
            అపార్ట్మెంట్ల నుండీఇళ్ల నుండీ వచ్చే మురుగును భూగర్భంలోకి పోకుండా చెయ్యడం అత్యంత అవసరం. ఈ మురుగు డ్రైన్లలోనికి మాత్రమే పారేటట్లు జరగాలి. అలా అయితేనే పంచాయితీ వారు భవన నిర్మాణానికి అనుమతినివ్వాలని ఒత్తిడి తెస్తున్నాం.

 

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల ఫిలాసఫి –

 

ఇది సేవ కాదు. ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నాము.

ఇందులో మనకొచ్చే ప్రతిఫలం కేవలం సంతోషం, సంతృప్తి మాత్రమే!

ప్రజలలో పరిశుభ్రతా సంస్కృతిని నెలకొల్పడానికి ఇంకా కృషి చెయ్యవలసిందే.

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి’ సాధనకు చేయవలసిన 6 పనులు :

 

1.       గ్రామ పంచాయితి ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ

         అ. రెండు రోజులకొకసారి ప్రతి ఇంటి నుండి తడి చెత్తపొడి చెత్త సేకరించి చెత్త నుండి సంపద కేంద్రానికి తరలించాలి.

           . వ్యాపార ప్రాంతాలుప్రధాన రహదారుల నుండి ప్రతి రోజూఉదయంసాయంత్రం రెండు సార్లు చెత్త సేకరణ జరగాలి. 

           ఇ. తడి చెత్త కంపోస్ట్ గానూపొడి చెత్త పునర్మించడానికి (Re Cycle) పంపాలి.

2.      చెత్తను రోడ్ల మీద వేస్తే జరిమానా విధించాలి.

3.      ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులన్నీ నిషేదించబడినవి.

                క్యారీ బ్యాగులు       

                ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు

                ప్లాస్టిక్ గ్లాసులు,

                ప్లాస్టిక్ టీ కప్పులు

                విస్తరాకులు,

                తగరం విస్తరాకులు

                స్ట్రాలు

                Ear Buds

                స్పూన్లుఫోర్కులు

                స్వీట్లను వడ్డించడానికి వేడుకలలో ఉపయోగించే కప్పులు

                పంటి పుల్లలు

                మెమెంటోలు

                బెలూన్లు

                కిళ్ళీ కవర్లు

                బొకేలు

                ఫ్లెక్సీలు

                పెరుగు కప్పులు

                ఐస్ క్రీమ్ కప్పులు

 

4.      రోడ్ల రక్షణ కోసం ఊరిలో రోడ్డు మార్జిన్ నుండి డ్రెయిన్ వరకు ఎత్తు లేకుండా చేయాలి.

5.      డ్రెయిన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.

6.      ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ఫ్లెక్సీల నిషేధాన్ని అమలుపర్చాలి.

                        హైకోర్ట్ ఫ్లెక్సీలను నిషేధించింది.

         కనుక మన గ్రామంలో ఆ నిషేదాన్ని అమలుచేసి మార్గదర్శకులం అవుదాం.

 

ధన్యవాదాలు :

 

           స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు.

 

డా.దాసరి రామకృష్ణ ప్రసాదు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల తరపున  

చల్లపల్లి,

14.11.2019.