Daily Updates

2256*వ రోజు......

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   పాతిక మంది మదాన వీరుల 2256* వ నాటి ఆదర్శం.   అది బుధవారం – వేకువ. బ్రహ్మ ముహుర్తానికి ముందే - 4.23 సమయం! సమీకృతులైన స్వచ్ఛ సైనికులు 25 మంది! ఎక్కడో కాదు - అన్యులకు భీతి గొలిపే – చాలా గ్రామాల్లో భీభత్స రస ప్రధానంగా మిగిలిపోయే రుద్రభూమి! చిరకాలంగా తాము నమ్మిన సత్సంకల్పం కోసం - శ్మశాన, పరిసర పరిశుభ్ర – స్వచ్ఛ - సౌందర్య సమీకరణా కృషిలో పాటుబడింది సుమారు 50 పనిగంటలు. తమకు సంతృప్తికరంగా వాళ్లు సాధించిన...

Read More

2255*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   31 మంది దాన వీరుల 2255* వ నాటి శ్రమసందేశం.   10 రోజులకు పైగా చెత్త కేంద్ర- అపూర్వ శ్మశాన కేంద్రాల దగ్గర కనిపించిన - శ్రమదాన వైభవమే-  ఈ ఆదివారం(17-10-2021) వేకువ కూడ పునరావిష్కృతమైంది.   - విజయవాడరహదారి-చిల్లల వాగు వంతెన కేంద్రకంగాను శ్మశానాంతర్గతంగాను- ద్విముఖంగా ప్రవర్తిల్లిన స్వచ్ఛ సుందరీకరణ ప్రయత్నం( గ్రామ సరి) హద్దులు మీరి వక్కలగడ్డ పరిధిలోకి చొచ్చుకు పోయింది కూడ. (ఇలా వీళ్లు హద్దులు మీరి చల్లపల్లికి చుట్టూ 10 -15 కి.మీ. వెళ్లడం గతం...

Read More

2254*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!    2254 * వ (శనివారం) నాటి సామూహిక శ్రమదానం!   సంక్రాంతైతేనేమీ – దేవీ శరన్నవరాత్రులైతే నేమీ- చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శ్రమ విరాళం లో ఏ మార్పూ ఉండదు.  అలాగే అది మురుగుకాలవైనా – శ్మశానమైనా స్వచ్చ సుందరీకరణ దీక్షలో కూడ ఏ మార్పూ కనిపించదు. ఆ విధంగా ఈ వేకువ 4.21 కే 30 మందితో కొనసాగిన శ్మశాన స్థలి పరిసర పరిశుభ్రతా చర్యలు – ఏడేళ్ళ మొదలు 67 ఏళ్ల వయసున్న శ్రమదాతల అకుంఠిత సేవ ఎవరైనా చూడదగిందీ, మెచ్చదగిందీ, అనుసరించదగిందీ.   శ్మశానాంతర్భాగమైన దహన వాటికల దగ్గర ఇదిగో ఈ పిల్లలు...

Read More

2253* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   విజయ దశమి - 2253* నాటి శ్రమదాన వీరం!   సాంప్రదాయకమైన పెద్ద పండుగ వేకువ కాలాన గూడ 24 మంది స్వగ్రామ హితకారులు తమ సామాజిక కర్తవ్యాన్ని మరువలేదు. అదెక్కడంటే - కంపు గొట్టే ఊరి చెత్త కేంద్రం దగ్గర! ‘Cleanlyness is next to Godlyness’ అని ఇంగ్లీష్ వాళ్లనానుడి. ‘దైవం మానుష రూపేణ' అని భారతీయుల నమ్మకం. దైవత్వానికి ప్రతిరూపం స్వచ్ఛ – శుభ్రతలైతే – 2253* రోజుల ఒరవడిలోనే - ఈ పెనుపండుగ బ్రహ్మముహుర్తాన ఊరి పరిశుభ్ర సౌ...

Read More

2252* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   గ్రామాభ్యుదయ చరిత్రలో 2252* వ పుట.               14-10-21 వేకువ సమయాన ఊరికి దూరంగా శ్మశానాని కవతల - ఇంత పెద్ద ఊరి చెత్తంతా పోగుబడే చోట – 4.22 వేళకే 19+4 = మొత్తం 23 మంది తలపెట్టిన రాచకార్యమేమంటే – గ్రామ సామాజిక చైతన్య స్ఫోరకమైన, జన స్వస్తతా మూలకమైన, వేలాది దినాల చిరకాల పారంపర్యమైన శుభ్ర - సుందర ప్రయత్నమే!  ...

Read More

2251* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   2251* వ నాటి స్వచ్చోద్యమ కథనం.   బుధవారం (13-10-21) వేకువ 22 మంది సచ్ఛంద కార్యకర్తల 100 నిముషాల స్వేద పూర్వక శ్రమదానంతో చెత్త కేంద్ర రహదారి కిరువైపుల గల సిమెంటు రోడ్లు, వాటి పరిసరాలు మరి కొంత పరిశుభ్ర - సౌందర్య శోభను సంతరించుకొన్నాయి. వీటి దగ్గర కూడ ముఖ్యంగా దక్షిణపు రోడ్డు దగ్గర ఒళ్ళు జలదరించే దుర్గంధం లేకపోలేదు. ఈ కంపే కార్యకర్తలకు ఇంపనుకొనేరు, గ్రామ మెరుగుదల పట్ల వాళ్ల అంకితభావాన్ని ఏ పూతి గంధమూ అడ్డుకోజాలదని మాత్రమే ఈ సన్నివేశం చాటుతుంది!  ...

Read More

2250 *వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   ఊరి శుభ్ర-సుందరీకరణ ప్రక్రియలో 2250* వ ప్రయత్నం.                      ఆదివారం (10.10.2021) నాటి చెత్త కేంద్ర క్రమబద్ధీకరణకు 4.30 వేళ 17 మంది, కొద్ది వ్యవధిలో అంతేమంది – (ఇందులో ఇద్దరు ట్రస్టు సంబంధీకులు) చూపిన 2 గంటల తెగువతో అంతకు ముందు మూసుకుపోయిన సిమెంటు బాట, దాని పార్శ్వాలు ఒక కొలిక్కి వచ్చినట్లే. 34 మంది శ్రమదాతలకు సమస్యల్లా – ముక్కులు మూసుకొన్నా ఊపిరితిత్తుల్లో చొరబడుతున్న దుర్మార్గపు దుర్గంధమే! కేవలం ఈ 2 గంటల పనికి మనిషికి వెయ్యి రూపాయిలిచ్చినా ఈ రోజుల్లో ఎవరైనా సిద్ధపడతారా అనేది చెప్పలేం! వస్తే గిస్తే-ఇంత ఇష్టపడి,...

Read More

2249*వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   గ్రామ స్వచ్చోద్యమ ప్రస్థానంలో 2249* వ అడుగు.               శనివారం బ్రహ్మ ముహూర్తానికి ముందే 4.20 సమయం! అది నీరవ నిశ్శబ్ద శ్మశాన ప్రాంగణం! ఉభయ దిశల్లో చక్కటి దహన వాటికలు! మరి, 24 మందికి ఇక్కడ ఏ రాచకార్యం తటస్థించి వచ్చి చేరారు? ఇంకో ప్రక్కన కీర్తి శేషించిన వాళ్లకు వీడ్కోలు పలుకుతున్న అంతిమ సమయ వాహనం! అప్పుడు అక్కడ 2 గంటల పాటు ఈ కార్యకర్తలు సాధించినదే పరమార్థం? శుష్క ప్రసంగాలు కాక - ఆదర్శ క్రియా పూర్వకంగా చాటినది ఏ సందేశం?... ...

Read More

2248*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   2248* నాళ్ళ స్వచ్చోద్యమ గమనంలో నేటి క్లిష్టమైన అడుగులు.   ఈ వేకువ 4.30 కాకముందే 3 – 4 కిలోమీటర్లు ప్రయాణించి, వాట్సాప్ తొలి చిత్రంలో కనిపిస్తున్న 19 మంది ఎక్కడ నిలబడ్డారో గమనించారా? ఈ పెద్ద ఊరి తడి – పొడి చెత్తల కుళ్ళు కంపుల కేంద్రమైన డంపింగ్ యార్డులో! స్వల్ప వ్యవధిలోనే వాళ్ళతో కలిసిన 14 మంది – వెరసి ఈ 33 మంది 100 నిముషాల పాటు ఏం సంపాదించారు? (సారీ – ఏం సాధించారు) అని ప్రశ్నిస్తే – కాస్తంత సామాజిక చైతన్యం, ఉన్న ఊరి పట్ల కొంతైనా శ్రద్ద - బాధ్యత ఉన్న వాళ్ళకే అది పూర్తిగా అర్ధమౌతుంది!   ...

Read More
[1] 2 3 4 5 ... > >>