స్వచ్ఛ – శుభ్ర – సుందర చల్లపల్లిలో పొరుగు జిల్లా జిజ్ఞాసువులు. ఈ శనివారం గుంటూరు జిల్లా వివిధ మండలాల – వివిధ గ్రామాల నుండి వచ్చిన వివిధ నేపధ్యాల – వర్గాల – వయస్సుల వారు 30 మంది ఆరేడు గంటల పాటు గ్రామాన్ని సందర్శించి, పరిశీలించి, ...
Read More2111* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి విశేషాలు. నిన్నటి నిర్ణయం ప్రకారం బెజవాడ మార్గంలో – 6 వ నంబరు పంటకాలువ, విజయా కాన్వెంట్, చిన్న కార్ల కడుగుడు/మరామత్తుల స్ధలం అనే మూడు చోటుల మధ్య జరిగిన స్వచ్ఛ – శుభ్ర చర్యలలో 28 మంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు. తమ శక్తి మేరకు వీరు గ్రామం మెరుగుదలకు ప్రయత్నించిన ముహూర్తం వేకువ 4.23, 6.20 వేళల నడుమ. వేలాది దినాలుగా నడుస్తున్న చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో తిలకిస్తున్న – గమనిస్తున్న గ్రామస్తులకు గాని...
Read More2110* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలోని అకుంఠిత గ్రామ సేవలు. ఈ శుక్రవారం (22.01.2021) నాటి 25 మంది కార్యకర్తల హృదయపూర్వక శ్రమదాన వైభవంతో స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత గ్రామ విభాగం – పురాతనకోట ఈశాన్య బురుజు దగ్గరి 3 దారుల ప్రధాన కూడలి. నెమ్మదిగా – క్రమంగా – పట్టణీకరణ బాట పట్టిన ఈ ప్రాచీన చల్లపల్లి గ్రామమంతటికీ ఈ చోటే ప్రధాన కేంద్రం. క్రిక్కిరిసిన పలువిధాల దుకాణాలలో – తోపుడు బళ్ళతో - ద్విచక్ర వాహన విక్రయ మరమత్తుల కొట్లతో – ఈ అన్నిటి మూలంగా ఊరిలో నుండి, బైట నుండి వచ్చి పోయే ఏడెనిమిద...
Read Moreజయహో చల్లపల్లి స్వచ్ఛ సైన్యం - 2109* వ నాటి స్మరణీయ శ్రమదానం. ఇది గురువారం - 21.01.2021! ఈ వేకువ 4.23 - 6.20 కాలముల నడుమ 28 మంది గ్రామ స్వచ్ఛ - సుందర కార్యకర్తల నిన్నటి తరువాయి బాధ్యతలు బందరు రహదారి మీదనే - ద్విముఖంగా జరిగాయి. మొదటిది - 6 వ నంబరు కాలువ గట్టు, రెండవది - వంతెన మొదలు పింగళి వారి ఆసుపత్రి దాక జరిగిన దారి శుభ్రత. నిన్నటి, నేటి డజను మంది మొండి పట్టుదలతో కాల్వగట్టు - కార్యకర్తల అంచనా మేరకు సురక్షితమైన ఉద్యానవనానికి సిద్ధమైనది. గుడ్లు పెట్టె కోడి బాధ తినేవాడికి తెలియదు. 2109 రోజులుగా గ్రా...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లిలో - 2108* వ నాటి ముందడుగులు. 20.01.2021 - బుధవారం నాటి వేకువ 4:11 సమయానికే మొదలైన గ్రామ స్వచ్చోద్యమ కారుల ఉద్యోగ (ప్రయత్నం) సందడి ఏకధాటిగా - రెండు గంటలకు పైగా - 6.21 వరకూ కొనసాగింది. 31 మంది శ్రమదాతల కృషి కృతకృత్యమైన ప్రాంతం బందరు జాతీయ మార్గంలోని - రామానగరం సరిహద్దు దగ్గరి - 6 వ నంబరు పంట కాలువ పడమటి గట్టు మీద - ఆస్పత్రులకూ, అమలు లో లేని బియ్యం మరకూ నడిమిచోటు. అసలు తొలుత నిర్ణయించుకొన్నదేమ...
Read Moreచల్లపల్లి స్వచ్ఛ – సుందర ఉద్యమం - 2107* వ నాటి కృషి. ఈ ఆదివారం (17.01.2021) నాటి వేకువ 4:23 సమయంలో విజయవాడ బాటలోని బాలాజి విభాగ భవన సముదాయం దగ్గర ఆగి, తమ తమ స్వచ్చాయుధ సంపన్నులైన 34 మంది స్వచ్ఛ సైనికులు 6.20 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతలు విజయవంతమైనవి. అపార్ట్ మెంట్లకు ఉత్తర దిక్కున, దక్షిణ దిశలోని దారికిరువైపుల డ్రైనులు, వాటి గట్టులు ప్రస్తుతానికి శోభాయమానంగా మారినవి! ఇతర కార్యకర్తలు ఒకమారు శుభ్రపరచిన చోటులను మరింత శ్రద్ధగా, నిక్కచ్చిగా, పట్టి పట్టి సుందరీకరణ విభాగం వాళ్ళు అప్పు...
Read Moreస్వచ్చోద్యమ సుందర చల్లపల్లిలో 2106* వ నాటి నిలువెత్తు స్ఫూర్తి. ఈ శనివారం వేకువ 4:35 నుండి 6.30 దాక విజయవాడ బాటలో - బాలాజి భవన విభాగాలకు కుడి ఎడమల - అర కిలోమీటరు పర్యంతం స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరించిన శ్రమదాతలు 44 మంది. వీరిలో 21 మంది తొలి వాట్సాప్ ఛాయా చిత్రంలో ఉంటే - కొన్ని నిముషాల వ్యవధిలో మిగిలిన బాధ్యులు తోడయ్యారు. వీరు కాక 6.30 తరువాత అవనిగడ్డ నుండి విలక్షణ రాజకీయవేత్త (సింహాద్రి రమేష్ గారు), తదనుచరులు ఏడెనిమిది మంది కూడ కలిశారు. ...
Read More2105* వ – (కనుమ పండగ) నాటి చల్లపల్లిలో స్వచ్ఛంద శ్రమదానం. ఈ 15.01.2021 – గురువారం వేకువ సమయాన – మంచు దట్టంగా క్రమ్ముకొస్తున్న 4:29 ఘడియలకు 25 మంది స్వచ్ఛంద – స్వచ్చ సైనికులు విజయవాడ మార్గం – చిల్లలవాగు వంతెన దగ్గర – తరిగోపుల ప్రాంగణం దగ్గర – అనుకొన్న వేళకన్న ముందే ఠంచనుగా హాజరయ్యారు. ...
Read Moreఒక్క సారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! ఏడేళ్ళ స్వచోద్యమ చల్లపల్లిలో 2104* వ నాటి బాధ్యతలు. ఈ సంక్రాంతి పర్వదిన బ్రహ్మ ముహూర్తంలో –వేకువ సమయంలో- తమ గ్రామ పరిశుభ్రత కోసం కష్టించిన కార్యకర్తలు 27 మంది. ...
Read More