రామారావు మాష్టారి పద్యాలు

22.02.2024...

 ఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది స్థిరత్వం సమకూర్చుకొన్నది - చేతనత్వం నింపుకొన్నది అంగ బలమూ కొదవ లేనిది - ఆటుపోటుల తట్టుకొన్నది ఆశయం గురి చూసి ఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది స్వచ్ఛ సుందర ఉద్యమానికి జయం తప్పక లభిస్తున్నది !...

Read More

21.02.2024...

              వస్తు వినిమయ పాటవంతో జనాభా విస్ఫోటనంతో- వస్తు వినిమయ పాటవంతో సదవగాహన లేమితోనే సకల కాలుష్యాల భూతం ఆపకుంటే జీవరాసులు అంతరించే పెను ప్రమాదం అందుకే గద కార్యకర్తల అలవిమాలిన నిత్యయత్నం!...

Read More

20.02.2024...

        స్పందించని వారి కొరకు ఎన్నాళ్ళని సొంతూరిని ఇంతగ సేవించగలరు! వైయక్తిక బాధ్యతలను వాయిదాలు వేయగలరు! వెగటు లేక - విసుగు లేక కసవులూడ్చు చుండగలరు! స్పందించని వారి కొరకు శ్రమను సమర్పించగలరు!...

Read More

19.02.2024...

       ఇది సవనం అనవచ్చా? పావులక్ష జన హితముకు పాతిక మంది పాటుబడుట, దశాబ్ది పైగా వదలక దాని కొరకు యత్నించుట- ఇది వ్యసనం అందామా? ఇది సవనం అనవచ్చా? ...

Read More

18.02.2024 ...

           చక్కని ఊరేదనగా 3 వేల రోజులుగా ముమ్మర శ్రమ వేడుక గల, స్వార్థం వాసన తగలక త్యాగం వెలుగులు సోకిన స్వచ్ఛ కార్యకర్తలున్న చక్కని ఊరేదనగా ...

Read More

17.02.2024...

      ఇది గద శ్రమదానమనగ ఇది గద శ్రమదానమనగ – ఇదె అంకిత భావ మనగ వట్టి కబుర్లకు బదులుగ గట్టి మేలు చేయుటనగ సమైక్య శ్రమ వేదికనగ - చక్కని ఆదర్శమనగ గ్రామ తక్షణావశ్వక ప్రతి చర్యంటే ఇదే!...

Read More

16.02.2024...

          ఆత్మన్యూనత సైతం గ్రామ వీధి శ్రమకు దిగిన కార్యకర్త ఏ ఒకరిని పరిశీలించిన చాలును వికసిస్తది మానసం వారి ముందు చిన్నబోవు పరిస్థితికి జారిపోయి ఆత్మన్యూనత సైతం ఆవహించు నాక్షణం!...

Read More

15.02.2024...

       దీర్ఘకాల ఉద్యమాలు పనితత్త్వం తెలియక, తమ ప్రజల పట్ల మమత లేక జన జీవన స్రవంతిలో స్నానం - పానం చేయక మంచి - చెడుల మమేకమై మానవ విలువలు తెలియక దీర్ఘకాల ఉద్యమాలు జయప్రదం కాగలవా...

Read More

14.02.2024...

            మరీ ఇంత త్యాగగుణము ఊరి కొరకు వేలనాళ్ల ఉత్తమమగు శ్రమదానము ఏ స్వార్ధము లేదంటే ఎవరూ నమ్మని కాలము మరీ ఇంత త్యాగగుణము మన కాలములో ఎరుగము  అందుకె ఇది జీర్ణించుట కాలస్యము జరుగునేమొ!...

Read More
<< < ... 3 4 5 6 [7] 8 9 10 11 ... > >>