Category Archives: ramaravu mastari padyalu

విరాళాల రామబ్రహ్మం

వైద్యశిబిరమున అతడే – స్వచ్చోద్యమమందతడే – సొంత ఊరు పాగోలు శ్మశానం పనులందతడే – సద్భావనలున్నచోట అతడు వచ్చి చేరునా? రామబ్రహ్మమున్నక్కడ సమాజ సేవలుండునా?   పరిమిత ఆదాయంతో- స్వల్ప ఆస్తిపాస్తులతో స్వచ్చ చల్లపల్లిని – తన స్వగ్రామం పాగోలును సొంతంగా తలచుకొని – లక్షలలో విరాళమిచ్చి ఇంతగ అభివందనీయుడెట్లయి పోయాడోమరి!   వెనుక ముందు

ఈక్వేషన్

ఈక్వేషన్   ప్రసంగాలు – ప్రవచనాలు – పరమార్థపు బోధనలు తర్కవితర్కాలు – ధర్మాధర్మ వాదనలు చట్టాలూ – న్యాయాలూ – సమర్థనలు – విమర్శనలు ఒక్కపూట స్వచ్ఛసేవ కొక్కింతైన చాలవు!   -నల్లూరి రామారావు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త