ముఖ్యమంత్రి గారికి 5 సూచనలు

మొన్న (06-06-2017) సాయంత్రం ‘నవనిర్మాణ దీక్ష’ సభలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి – డబ్బుతో సంబంధం లేకుండా కేవలం అధికారం ఉపయోగించి 5 పనులు చేస్తే ‘స్వచ్ఛాంధ్ర ప్రదేశ్’ ని సాధించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పడం జరిగింది.

  1. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలి.

(ప్రతి ఇంటి నుండి, వ్యాపార సంస్థ నుండి, కార్యాలయం నుండి ప్రతి రోజూ గాని, రెండు రోజులకు ఒకసారి గాని చెత్తను సేకరించే విధానం మొదలుపెట్టిన తరువాత ఈ పనిని చేయాలి.)

  1. 50 మైక్రాన్ల క్యారీ బ్యాగులను కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ ప్రతి చోటా వాడుతూనే ఉన్నారు. అధికారులు తమకున్న అధికారాన్ని ఉపయోగించి ఈ నిషేధాన్ని అమలు చేయాలి.

100 మైక్రాన్ల క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ గ్లాసులను మన రాష్ట్రం నిషేధించి అమలు చేయాలి.

  1. ఒకరోజు వాడి పారేసే ఫ్లెక్సీల వాడకాన్ని బ్యాన్ చేసి గట్టిగా అమలు చేయాలి.

ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలో ఫ్లెక్సీల వాడకం మానేయాలి.

  1. రోడ్డు మార్జిన్ నుండి డ్రెయిన్ అంచు వరకు గల స్థలంలో ఆక్రమణలను తొలగింఛి ఖాళీగా అట్టిపెట్టాలి.
  2. డ్రెయిన్ లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.

 

-డా.దాసరి రామకృష్ణ ప్రసాదు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *