స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1815* వ నాటి సంఘటనలు (31.10.2019).

Group Photo
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
 
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1815* వ నాటి సంఘటనలు (31.10.2019).
వానకు సెలవిచ్చి, మంచు, చలిగాలి జంటగా వచ్చిన ఈ వేకువ 4.06-6.05 ల మధ్య సమయంలో గంగులవారిపాలెం దారి చివర జరిగిన ఐచ్చిక శ్రమదానంలో పాల్గొన్న నిస్వార్థ గ్రామ సేవకులు 29 మంది.
 
బండ్రేవుకోడు మురుగు కాలువ ఉత్తరపుగట్టున నిన్నటి సశేష స్వచ్చ కృషికి కొనసాగింపుగా- వంతెన దాకా, ఇంకా పొలంగట్టు వైపున పెరిగిన గడ్డిని, పిచ్చి మొక్కల్ని, ఖాళీ మద్యం సీసాలను, ప్లాస్టిక్ వ్యర్ధాలను చిత్తు కాగితలతో సహ- నరికి, పీకి, ఏరి, పోగులు చేసి, ట్రస్టు ట్రాక్టర్లో నింపి డంపింగ్ కేంద్రానికి తరలించారు. కొంత తుక్కును మాత్రం వానలకు కోసుకుపోతున్న కాల్వ గట్టు పల్లాలలో సర్దారు.
 
దాసరి రామ మోహనరావు గారి ముందు చూపుతో 20 ఏళ్లనాడు గ్రామ ప్రవేశంచేసిన అలస్టీనా (ఏడాకుల) చెట్లు స్వచ్చ కార్యకర్తల కృషితో – సంరక్షణలో వందల సంఖ్యలో ప్రధాన రహదారులంతా వ్యాపించి, పచ్చదనంతో, లక్షల కొద్దీ పూల ఘాటు వాసనలతో ఆ చేట్లే గ్రామ చిహ్నంగా మారిపోయినవి. ఇప్పుడీ చల్లపల్లిని బిళ్లగన్నేరుపల్లి, అడవి తంగేడు పల్లి,అలస్తినాపల్లి అని కూడపిలుచు కోవచ్చు! (ఐతే- వృక్ష శాస్త్రజ్ఞుల, అటవీశాఖ అధికారులు సానుకూల వివరణల తరువాత కూడా దురదృష్ట వశాత్తు కొద్దిమంది గ్రామస్తులు ఈ పూలవాసన ఎలర్జీకారకమని సందేహిస్తున్నారు.)
 
ఈ రోడ్డున సుందరీకరణ బృందంవారు శుభ్రం చేస్తున్నప్పుడు అలస్టీనా చెట్ల అందమైన, రాలుతున్న ఫూలు,పూల ప్పొడి వారి చీపుళ్లకడ్డుతగులుతున్నవి.
5.45కే ఇతర పనులను ముగించి, ఎక్కువమంది కార్యకర్తలు 25 అడవితంగేడు మొక్కలు నాటారు.
 
కాఫీ అనంతర సమీక్షా సమావేశంలో నవంబరు 17 – ఆదివారం నాటి ఐదేళ్ల సేవల వేడుక నిర్వహణను, సన్నద్దతను- చర్చించారు.
 
అన్యాపదేశంగా కోడూరు వెంకటేశ్వరావు గారిని పాత్రగా నీతికథ చెప్పి, ముమ్మారు నాయుడు మోహనరావుగారు లయ బద్ధంగా పలికిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో 6.30 కి నేటి బాధ్యతముగింపు.
రేపటి స్వచ్చ కృషి కూడా ఈ గంగులవారిపాలెం దారిలోనే.
 
మన కోసం మనం
‘మనకోసం మనం’ కదలి మహాకృషికి దిగినప్పుడు
మన స్వస్తత – మనభద్రత మన చేతిలొ ఉన్నప్పుడు
ఎవరికొరకొ దేబిరించి ఎదురుచూచు దిగులెందుకు ?
స్వచ్చోద్యమ చల్లపల్లి స్రవంతిలో దిగరెందుకు ?
 
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు – మనకోసం మనం ట్రస్టు
గురువారం – 31/10/2019
చల్లపల్లి.

 

(1)4.06 కు గంగులవారిపాలెమ్ రోడ్డులో(2) (2) (3) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12) (13) (14) (15) (16) 17 18 19 20 21 22 23 24 25 26

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *