స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1819* వ నాటి శ్రమ దానాలు.

Group Photo

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1819* వ నాటి శ్రమ దానాలు.

         “ప్రతి సోమవారం ప్రధాన వీధుల పారి శుద్ధ్య మెరుగుదల”అనే స్వచ్చ చల్లపల్లి సంప్రదాయానుసారంగా నేటి వేకువ 3.58 – 6.05 నిముషాల మధ్య బందరు దారిలోని 6వ నంబరు పంట కాల్వ వంతెన నుండి మూల్పూరి గార్డెన్స్ దాక నిర్వహించిన స్వచ్చంద సమయ- శ్రమదానంలో భాగస్వాములు 31 మంది. కొత్త వాళ్ళకు ఇంత “శుభ్రంగా – అందంగా ఉన్న ప్రదేశంలో చేసేందుకు ఏముంది….” అనిపించవచ్చు గాని, చల్లపల్లి కార్యకర్తలకు మాత్రం ఈ రోడ్డు మీద ఇసుక దుమ్ముల్ని, ఊడ్చి దారి అందాలకు మెరుగులు దిద్దడం, రెండు వైపులా ఉన్న రంగు రాళ్ళ మురికిని, దుమ్మును గోకి, ఊడ్చి, తామే గత నాలుగేళ్ల నుండి నాటి పెంచిన చెట్లు కొమ్మల్ని ట్రిమ్ చేసి. రకరకాల వ్యర్థాలను ఏరి, డిప్పలతో ఎత్తి ట్రాక్టరులో నింపి ప్రధాన చెత్త కేంద్రానికి చేర్చడం వంటి పనులతో గంటన్నర సమయం ఇట్టే గడిచి పోయింది.

జూనియర్ కళాశాల ఎదుటి ఉద్యాన వనం చుట్టూ గట్టును కూడ వదలక, సుందరీకరణ బృందం దాన్ని కడిగి, వెలిసిన రంగులు స్పష్టంగా కనిపించేందుకు శ్రమించడాన్ని గ్రామప్రజలు అర్థం చేసు కోవాలి. “స్వచ్చసుందర హరిత చల్లపల్లి” పేరును సార్థంకం చేయడంలో ప్రతి ఒక్కరం సహకరిద్దాం.

        రోడ్లదుమ్ము ఉడ్చే ట్రాక్టరు పని చేసినా, ఇంకా మిగిలి పోయిన ఇసుక, దుమ్ముల్ని ఊడ్చి-ఊడ్చి తమ గ్రామ పవిత్రత కోసం శ్రమించిన స్వచ్చంద కార్మికులకు అభివందననాలు. ఈ ఊళ్లో ఒక వివాహం కోసం “కాకుమాను” నుండి వచ్చిన ఇద్దరు పోటోగ్రాఫర్లు వింతగా, ఆశ్చర్యంగా కనిపించిన చల్లపల్లి స్వచోద్యమాన్ని గమనించి, అడిగి తెలుసుకొని ఆనందించారు.

నిన్నటి “స్వచ్చ యార్లగడ్డ” లో కోలాహలంగా పాల్గొన్న అ గ్రామస్తులకభినందనలు. ఈ 31 మందికి కార్యకర్తలకు బిస్కట్ల అతిధ్యం ఇచ్చిన ఉడత్తు రామారావు గారికి, 1000/- ‘మనకోసం మనం’ ట్రస్టుకు విరాళ మందించిన రాయ పాటి రాధా కృష్ణ గారికిధన్య వాదాలు. లక్ష్మణ రావు గారు నమస్కార పూర్వకంగా ముమ్మారు ప్రకటించిన స్వచ్చ హరిత సుందర ఉద్యమ సంకల్పనినాదలతో శ్రుతి కలిపి 6.30 కి నేటి గ్రామ బాధ్యతలు ముగించారు.

రేపటి మన కర్తవ్యాన్ని రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర కలుసు కొని నిర్వహిద్దాం!

కత్తి దూసిన రెండు ఉళ్లవి

స్వచ్చ శుభ్ర సౌందర్యపు సాధనకై కదంత్రొక్క

యల్లాయ పాలెం ఉన్నది- యార్ల గడ్డ గ్రామముంది

చల్లపల్లి ప్రేరణతో సహస్ర గ్రామాలు కదలి

కాలుష్యం రక్యసిపై కత్తి దూయు సమయం ఇది!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 4/11/2019

చల్లపల్లి.01 3.58 కు కీర్తి హాస్పిటల్ దగ్గరి SBI వద్ద 02 3 4 5 6 7 8 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 43 46 49 51 58 59 60 61 63 65 66 68 69 70 72 Group Photo

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *