స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1820* వ నాటి స్వగ్రామ ఋణవిముక్తి.

Group Photo

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1820* వ నాటి స్వగ్రామ ఋణవిముక్తి.

         ఈ వేకువ 3.58 – 6.00 మధ్య రిజస్ట్రారు కార్యాలయం-రాయ పాటి రాధా కృష్ణ గారి ఇంటి నడుమ జరిగిన కర్తవ్య నిర్వహణలో భాగస్తులైన కార్యకర్తలు 38 మంది.

నేటి స్వచ్చ సుందరీకరణ ప్రధానంగా రోడ్డుకు దక్షిణ దిశలోనే సాగింది. పంజా, చీపురు, గోకుడు పారలే ప్రధాన పనిముట్లు, కత్తుల కంతగా పని పడ లేదు. వీరిలో ఎక్కువమంది రహదారి ప్రక్కన మురికి, దుమ్ము, ఇసుక పేరుకు పోయిన రంగు రాళ్ళను గోకి, ఊడ్చి, పొగులు చేయడంలోనే శ్రమించారు. ఒక్క పర్యాయం కాదు-రెండవ, మూడవ మారు కూడ చేస్తేనే ఆ ప్రాంతమంతా 6.00 తర్వాత ఇంత శుభ్రంగా, సుందరంగా కనిపిస్తున్నది.

   నలుగురు మహిళలు, నలుగురు పురుష కార్యకర్తలు డాక్టరు పింగళి మధు సుదనరావుగారి రహదారి వనంలోకి చొచ్చుకుపోయి, ఆ చీకట్లోనే మొక్కల పాదుల్ని సరిజేసి, ఆకుల్ని ఊడ్చి, కలుపు తొలగించి, ఆ తోట అందానికి మెరుగులుదిద్దారు.

     ఇంకొక ముఠా మునసబు వీధి తరువాత బందరుదారి ప్రక్క అమరావతి రాజా గారి, భగత్ సింగ్ గారి ఇళ్ల ఎదుటి జాగాలను శుభ్రపరిచారు. రాధా కృష్ణ-విజయరామ దంపతులు తమ ఇంటి ఎదురు ప్రాంతాన్ని స్వయంగా స్వచ్చ- శుభ్ర-సుందరం చేశారు.

నిన్న స్వచ్చ సైనికులు శుభ్ర పరిచిన ఈ దారికి దక్షిణంగా ఒకటి, ఉత్తరంగా మరొకటి కొత్త ఆక్రమణలు రాత్రికి రాత్రే జరిగి పోయాయి. రేపటి నుండి అక్కడ పుట్టుకొచ్చే వ్యర్థాలన్నీ బహుశా స్వచ్చ కార్యకర్తల కోసం ఎదురు చూస్తాయి .

ఉడత్తు రామారావు గారి చాక్లెట్ల పంపకం నేడు కూడా జరిగింది. అమెరికా ప్రవాసి, ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల సాంకేతిక నవీకరణకై శ్రమిస్తున్న మండవ శేషగిరి రావు గారు నేటి స్వచ్చంద సేవలో పాల్గొని, తన కృషిని వివరించి, ‘మనకోసం మనం’ ట్రస్టుకు 1000/- విరాళం సమర్పించినందుకు ధన్య వాదాలు.

   డాక్టరు          T. పద్మావతి గారి సాధికారిక స్వచ్చ సుందర సంకల్ప నినాదాలు ముమ్మారు  మారుమ్రోగి, 6.30 నిముషాలకు నేటి శ్రమదాన ఘట్టం ముగిసింధి ఈ సాయంత్రం 4.30 కు కీర్తి వైద్యశాల నుండి ప్రధాన వీధుల్లో దుకాణ దారులకు పంచాయితీ వారితో కలిసి, స్వచ్చ శుభ్ర అవగాహన కార్యక్రమంలో పాల్గొని విజయవంత చేద్దాం.

17 వ తేదీన జరుగనున్న గ్రామ స్వచ్చంద శ్రమదాన 5వ వార్షికోత్సవాన్ని, డిసెంబరు 21 నుండి 3 రోజుల విశాఖ యాత్రను గుర్తుంచు కొందాం.

          రేపటి మన గ్రామ స్వచ్ఛ సంకల్పాన్ని మునసబు గారి వీధి వద్ద కలుసుకొని, ఆచరిద్దాం!

ఋజువైనది చూడండని

మంత్రతంత్రముల ఫలితమొ- మహా మహిమ సారాంశమో-

కుల దైవం వరం వలనొ- కోట్ల కొలది ధనం వలనొ

స్వచ్చ- రమ్య- చల్లపల్లి సాకారం కాలేదని-

అర దశాబ్ది స్వచ్చోద్యమ కఠిన శ్రమ ఫలమేనని….

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 5/11/2019,

చల్లపల్లి.

05-10-19 (03.58 A.M)

3.58 కు రిగిస్ట్రారు ఆఫీసు వద్ద (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12) (13) (14) (17) (18) (19) (20) (21) (22) (23) (24) (25) (26) (27) (28) (29) (30) (31) (32) (33) (34) (35) (36) (37) (38) (39) (40) (41) (42) (44) (45) (46) (47) (48) (49) (50) (51) (52) (53) (54) (55)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *