పర్యావరణ ప్రేమికులు – డా. సజన గారు

నిన్న ఉదయం గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో ఉన్న డా. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరిగిన ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కి నేను, డా. పద్మావతి గారు హాజరవ్వజం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి డా. కోడెల శివప్రసాద్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు.

 

మా ఇద్దరికీ బాగా ఆసక్తి కలిగించిన విషయం – అక్కడ ఒక్క ఫ్లెక్సీ కూడా పెట్టకుండా అన్నీ గుడ్డ మీద రాయించిన బ్యానర్లే ఉన్నాయి. మన డా. రాజ్యలక్ష్మి గారి అమ్మాయి డా. శాంతి  అక్కడ ఒక నిర్వాహకురాలు. ముఖ్య నిర్వాహకురాలైన గైనకాలజీ డిపార్టుమెంటు హెడ్ డా. సజన గారికి మమ్మల్ని డా. శాంతి పరిచయం చేశారు. గుడ్డ బ్యానర్లే ఉండటం, ఫ్లెక్సీలు పెట్టకపోవడం మాకు సంతోషాన్నిచ్చిందని వారితో చెప్పాము. భూమికి ప్రమాదం చేసే వాటిని వేటినీ వాడనని, ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటానని డా. సజన గారు చెప్పిన మాటలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమాన్ని గురించి కూడా విన్నానని, కార్యకర్తలు ఎంతో అభినందనీయులని ఆమె చెప్పారు.

 

ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుందామని ఈ పోస్ట్ పెడుతున్నాను.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

06-05-2018

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *