హరిత వేడుకగా(Green Function) ‘కిన్నెర’ వివాహం

3097e953-7361-4617-ba7c-dcd7aa29424f

హరిత వేడుకగా(Green Function) ‘కిన్నెర’ వివాహం

స్థానిక కీర్తి హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన ‘కిన్నెర’ వివాహం నిన్న సాయంత్రం శ్రీ మంతు రాణి భవాని దేవి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహం ‘స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం’ ప్రచారం చేస్తున్నట్లు ‘హరిత వేడుక’గా జరిగింది.

1.కళ్యాణ మండపం బయట ఫ్లెక్సి పెట్టకుండా ఎలక్ట్రిక్ బల్బులతో ఆహ్వానాన్ని తెలిపారు.
2.భోజనాలలో కూడా టేబుల్ మీద పేపర్ వేశారు. అరటి ఆకుల్లో భోజనాలు వడ్డించారు. ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా పేపర్ గ్లాసులు వాడారు.

ఈ కళ్యాణాన్ని హరిత వేడుకగా నిర్వహించిన ‘కిన్నెర’ తల్లితండ్రులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి గార్లకు అభినందనలు.

చల్లపల్లిలో జరిగే అన్ని వేడుకలు ఇలానే ‘హరిత వేడుకలు’గా జరగడానికి మనమందరం కృషి చేసి మన ఊరిని ఒక నమూనాగా తీర్చిదిద్దుదాం

ఇట్లు
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
శనివారం – 25/08/2018.

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *