కాంతమ్మ-మాధవరావులకు అభినందనలు

12661859_1503798486594908_7474832025875764688_n

కాంతమ్మ-మాధవరావులకు అభినందనలు

రెడ్యూస్,రీయూజ్,రీసైకిల్ అనే ప్రిన్సిపల్స్ ను అమలుచేయడమే పర్యావరణ రక్షణలో శాస్త్రీయం.
452 రోజుల స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో భాగంగా శుభకార్యాలలోను,వివిధ సమావేశాలలోను ఆ నిర్వాహకులకు పర్యావరణ భద్రత కోసం మేం కొన్ని సూచనలిస్తూ వచ్చాం.అందులో ముఖ్యమైనవి:

  1. భోజన బల్లలమీద ప్లాస్టిక్ పేపర్ల బదులు మామూలు పేపర్లు వాడాలి.
  2. ఆకులతో కుట్టినవి,అరిటాకులు లేదా కడిగి మళ్లీమళ్లీ వాడదగిన పళ్ళేలు మాత్రమే వాడాలి.ప్లాస్టిక్ లేదా తగరం లేదా ధర్మాకోల్ విస్తర్లు వాడరాదు.
  3. ప్లాస్టిక్ గ్లాసులు,ప్లాస్టిక్ కప్పులు బదులు స్టీలు లేక పేపర్ గ్లాసులు,కప్పులే వాడాలి.
  4. సదరు కార్యక్రమాలలో పుట్టుకొచ్చిన చెత్తను ఊరిచివర్లోని డంపింగ్ యార్డుకు చేర్చాలి.

మాధవరావు-కాంతమ్మ దంపతులు ST సామాజిక వర్గానికి చెందిన అతి సామాన్యులు,పారిశుధ్య కార్మికులు.అంతగా చదువు సంధ్యలు లేని వీరిద్దరూ తమ కూతురు పెళ్లి విందులో పై నియమాలన్నిటిని చిత్తశుద్ధితో- అలవోకగా పాటించడం చూస్తే ముచ్చటగా ఉంది.

భోజన బల్లల క్రింద,బల్లల మధ్య తడిగాని,ఆహార పదార్ధాలు గాని లేకుండా శుభ్రంగా ఉంచారు.చేతులు కడుక్కునే చోట ఎంగిలిగ్లాసులు,కిళ్లీ కవర్లు,భోజన వ్యర్ధాలు,ఇతర వ్యర్ధాలు కనిపించనే లేదు.తగినన్ని చెత్త బుట్టలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.అసలా ప్రాంగణమంతటా అపరిశుభ్ర చాయలే లేకుండా పొడిగా,స్వచ్ఛంగా ఉంది. “పరిశుభ్రతే పరమాత్మ“ అనే గాంధిజీ సూక్తి అందరికి గుర్తుకు వచ్చింది.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం నుండి ప్రేరణ పొంది తమ బిడ్డ పెళ్లిని ఇలా పరిశుభ్రంగా చేశారు.కాగితాలకే పరిమితమవుతున్న పారిశుధ్య ఆదర్శాలను చిత్త శుద్ధితో ఆచరణలో పెడుతూ శుభకార్యం నిర్వహించిన కాంతమ్మ-మాధవరావు దంపతులకు స్వచ్ఛ కార్యకర్తల తరుపున మళ్లీ అభినందనలు.

జై స్వచ్ఛ సుందర చల్లపల్లి!
దాసరి రామకృష్ణ ప్రసాదు.

శనివారము – 06/02/2016

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *