మజ్జిగా! ఓహో మజ్జిగా! ....           11-Jun-2022

 

మజ్జిగా! ఓహో మజ్జిగా!

 

చిక్కని మజ్జిగ! చక్కని మజ్జిగ! ఝుమ్మను కమ్మని చల్లని మజ్జిగ

వేసవి ఎండల మంటలలో - మమ్మాదు కొన్న సంజీవనివో!

హడలెత్తించిన రోహిణిలో - ఉడుకెత్తే శరీరతాపములో

బైటకె రాకూడని సమయం - ఇది ఐనా తప్పని అవశ్యకం

స్వచ్చ సైనికుల సహకారంతో బాటసారులకు వరానివో!

 

                           మజ్జిగా! ఓహో మజ్జిగా!॥

 

అల్లం - మిర్చీ కలయికతో తగు మాత్రం లవణం చేరికతో

మండు వేసవికి విరుగుడువై మకరంద బిందు సంసేవికవై

సాదరముగ ప్రతి ప్రయాణికుని రారమ్మని దప్పిక తీర్చితివే

స్వచ్చ సైనికుల సహనంతో నీ చల్లదనం పోటీపడెనే!

 

                           మజ్జిగా! ఓహో మజ్జిగా!॥

 

పూర్వ విద్యార్ధి వితరణతో - ఇతరేతర దాతల పూనికతో

గస్తీ గదిచతురోక్తులతో నీ కమ్మని చల్లని నైజంతో

వందల - వేల బాటసారుల కమందానంద ప్రదాతవై

మండు వేసవిని దాటించితివే! ఎండ నుండి గట్టెక్కించితివే

 

                           మజ్జిగా! ఓహో మజ్జిగా!॥