స్వచ్ఛ, హరిత వేడుకగా హెవెన్లీ టాబర్నికల్ వివాహము

9df9f39d-67bd-44c8-92eb-da1da528356f

స్వచ్ఛ, హరిత వేడుకగా హెవెన్లీ టాబర్నికల్ వివాహము

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త జుఝవరపు ప్రశాంతమణి గారి రెండవ కుమార్తె ‘హెవెన్లీ టాబర్నికల్’ వివాహ సంధర్భంగా స్వచ్ఛ కార్యకర్తలందరిని విందుకు ఆహ్వానించారు.

వేడుకలలో పర్యావరణహితంగా మనం ఏమేమి చేయాలని చెబుతామో నిన్న జరిగిన ఈ వేడుకలో వారు అవన్నీ పాటించడం కార్యకర్తలందరిని ఆనందింపచేసింది.

  1. వేడుక జరిగే ప్రదేశం బయట ఫ్లెక్సీలు పెట్టవద్దు, గుడ్డ బ్యానర్ నే రాయించండి అని మనం చెబుతున్నాం. ఈ వేడుకలో గుడ్డ బ్యానర్నే రాయించారు.
  1. భోజనాల టేబుల్ మీద మామూలు కాగితం తప్పితే ప్లాస్టిక్ కాగితం వద్దని చెప్తున్నాం. అది కూడా ఆచరించి చూపించారు.
  1. ప్లాస్టిక్ విస్తరాకులు, తగరం విస్తరాకులు, ధర్మోకోల్ ప్లేట్లు వంటి భూమిలో కరగని వాటిని వాడవద్దని చెప్తున్నాం. ఆకులతో కుట్టిన విస్తారకులు గాని, అరటి ఆకులు గాని, వక్క ఆకుతో చేసే విస్తరాకులను గానీ వాడమని చెప్తున్నాం. ఈ వేడుకలో ఆకులతో చేసిన విస్తరాకులనే వాడారు.
  1. చాలా ఖరీదైన వేడుకలలో కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడడం చూస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్ గ్లాసులు భూమిలో కరగవు, రీసైకిల్ అవ్వవు. అందుకుని అవి వాడకుండా స్టీలు గ్లాసులు గాని, పేపర్ గ్లాసులు గాని వాడమని చెప్తున్నాం. ఈ వేడుకలో పేపర్ గ్లాసులు వాడారు.
  1. చేతులు కడుక్కునే ప్రదేశంలో పేపర్ నాప్కిన్లు, గ్లాసులు పడవెయ్యడానికి చెత్త బుట్టని ఏర్పాటు చేశారు. వచ్చిన అతిధులందరూ బుట్టలోనే వేశారు. పొరపాటున ప్రక్కన పడిన వాటిని చిన్నపిల్లలు వెంటనే తీసి చెత్త బుట్టలో వేశారు. చేతులు కడుక్కునే ప్రదేశం అత్యంత పరిశుభ్రంగా ఉంచారు.
  1. చెత్తను చెత్త బుట్టలోనే వెయ్యండి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అని రాసిన ఒక కార్డు బోర్డు నోటీసు కనిపించింది. అది చిన్న పిల్లలు రాసి తగిలించారట! కార్యక్రమానంతరం పిల్లలందరూ తలొక పూల మొక్కను నాకు, డా.పద్మావతి గారికి బహుమతిగా ఇచ్చారు.

ఈ కార్యక్రమం మొత్తంలో అన్నీ కూడా భూమిలో కరిగే వస్తువులనే వాడడం, భోజనశాల, చేతులు కడుక్కునే ప్రదేశం, కళ్యాణ మండపం అత్యంత పరిశుభ్రంగా అట్టిపెట్టడం ద్వారా స్వచ్చ కార్యకర్తలైన ప్రశాంత మణి గారు, సోని మిగిలినవారికి ఆదర్శంగా నిలిచారు.

స్వచ్చ హరిత వేడుకగా నిర్వహించిన జుఝవరపు ప్రశాంతమణి గారికి, సోనికి, వీరిద్దరికి సహకరించిన కుటుంబసభ్యులు, బంధువులందరికి స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలందరి తరపున అభినందనలు.

ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి వేడుకలోనూ ఆచరిస్తే మన ఊరు, మన ప్రాంతం ఎంతో శుభ్రంగా ఉంటుంది. పర్యావరణానికి హాని జరగదు.

    ఇట్లు
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి – 07/02/2019.

6a4cf694-813c-46d7-81a5-f1346d7e853c 39ae0ae1-16d6-4940-b2ba-3e0e2fab818c

0e795ca9-b715-4652-9194-960e1724d863

5a3dcc82-f66a-45bc-87fb-14867d44935d పరిశుభ్రంగా ఉన్న చేతులు కడుక్కునే ప్రదేశం 3e83dfbb-af2f-4f8e-8cde-46cf083139b3పరిశుభ్రత పాటించడంలో  ఈ పిల్లల పాత్ర  కూడా చిన్నదేమి కాదు

Powered by Facebook Like

One Response to స్వచ్ఛ, హరిత వేడుకగా హెవెన్లీ టాబర్నికల్ వివాహము

  1. Esrkprasad says:

    You made CHALLAPALLI a clean town. Congratulations Doctor .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *