విరాళాల రామబ్రహ్మం

వైద్యశిబిరమున అతడే – స్వచ్చోద్యమమందతడే –

సొంత ఊరు పాగోలు శ్మశానం పనులందతడే –

సద్భావనలున్నచోట అతడు వచ్చి చేరునా?

రామబ్రహ్మమున్నక్కడ సమాజ సేవలుండునా?

 

పరిమిత ఆదాయంతో- స్వల్ప ఆస్తిపాస్తులతో

స్వచ్చ చల్లపల్లిని – తన స్వగ్రామం పాగోలును

సొంతంగా తలచుకొని – లక్షలలో విరాళమిచ్చి

ఇంతగ అభివందనీయుడెట్లయి పోయాడోమరి!

 

వెనుక ముందు చూడకుండ – వీలగు ప్రతిపనికీ తన

పించనులో అత్యథికం వచ్చిన వెంటనె పంచే

రామబ్రహ్మం వంటి వాళ్లు గ్రామానికి ఒకడున్నా

దేశ స్వచ్చశుభ్రతలకు దిగులన్నదె లేదన్నా!

 

మురుగు కాల్వతుక్కులాగి మురిసిన ఆతనిచేతులు

శ్మశానాలు- రహదార్లకు స్వచ్చత నేర్పిన చేతులు

దారులూడ్చి ప్రతి పనికీ దానం చేసిన చేతులు

ప్రజాసేవ మార్గమందె రామబ్రహ్మం నడకలు

 

                     (స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల తరుపున)

                               నల్లూరి రామారావు

                               స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

                               చల్లపల్లి – 21.10.2019.

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *