స్వచ్చ సుందర చల్లపల్లి – 08-06-2017

f99acb39-265a-4c62-8d7f-274b8790fbab

అలుపెరుగని స్వచ్చ సైనికుల సేవా విన్యాసం @ 940*

స్వచ్చ సుందర చల్లపల్లి సాధనలో భాగంగా ఈరోజు ఉదయం 4-30 గంటల నుండి 6-00 వరకు 38 మంది స్వచ్చ కార్యకర్తలు రాజ్యలక్ష్మి గారి బజారు నుండి ఇస్లాం బజారు వరకు ఉన్న డ్రెయిన్ ను శుభ్రం చేశారు. మందుసీసాలు, వాటర్ బాటిల్స్, క్యారీబ్యాగులు, ఇసుక, కంకర మొదలగు భవన నిర్మాణ సామగ్రితో డ్రెయిన్ చాలాచోట్ల నిండిపోయి ఉంది. కార్యకర్తలు ఎంతో శ్రమపడి దీనిని తొలగించారు.

మోపిదేవి వాస్తవ్యులు కమలశ్రీ గారు, చిన్నబ్బాయి గార్లు ‘మనకోసం మనం’ ట్రస్ట్ కి ప్రతినెలా ఇచ్చే 500/- రూపాయల విరాళాన్ని ఈనెలకు గారు ఈరోజు అందించారు.

“ఖాన్” గారు చెప్పిన ‘జై స్వచ్చ సుందర చల్లపల్లి’, ‘స్వచ్చ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు విజయవాడ రోడ్డులో 6వ నెంబర్ కాల్వ వద్ద కలుసుకుందాం.

కార్యకర్తలకు విజ్ఞప్తి:
తొలకరి వానలు మొదలైనాయి. కార్యకర్తలు అందరూ ఇంకుడుగుంటలను తొందరగా ఏర్పాటు చేసుకుని ఆదర్శవంతంగా నిలవాలని విజ్ఞప్తి.

కుమారునితో కలిసి స్వయంగా ఇంకుడుగుంట ఏర్పాటు చేసుకున్న స్వచ్చ కార్యకర్త నల్లూరి మోహనరావు గారికి అభినందనలు.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
గురువారము – 08.06.2017

అంతా కనికట్టా?

ఎవరు చెప్పగలరిది త్యాగాల యుగం కాదని?
నిస్వార్థం, శ్రమదానం నిజం కాదు ఆదర్శం అని?
ప్రతిరోజరవై మంది – ప్రతి యొక్కరు గంటన్నర
లక్ష గంటల శ్రమ సంస్కృతి అచ్చం కనికట్టేనని?

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *