స్వచ్చ సుందర చల్లపల్లి – 09-06-2016

DSCN7054

అపూర్వ సేవలు – ఆదర్శ త్యాగాలు – స్వచ్చ సేవకుల 941* రోజులు

స్వచ్చ సుందర చల్లపల్లి సాధనలో భాగంగా ఈరోజు ఉదయం 4-18 గంటల నుండి 6-00 వరకు 40 మంది స్వచ్చ కార్యకర్తలు చల్లపల్లి సెంటర్ నుండి రాజ్యలక్ష్మి గారి బజారు వరకు ఉన్న డ్రెయిన్ ను శుభ్రం చేశారు.

ఈరోజు ఎంతో శ్రమపడి డ్రెయిన్ ను శుభ్రం చేసిన కార్యకర్తలు అందరూ ఎంతో అభినందనీయులు.

చల్లపల్లి ఉప సర్పంచ్ “ముమ్మనేని నాని” గారు చెప్పిన ‘జై స్వచ్చ సుందర చల్లపల్లి’, ‘స్వచ్చ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు చల్లపల్లి ATM సెంటర్ లో కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
శుక్రవారము – 09.06.2017

5AM – 08-06-2017

జూన్ – ఎనిమిదవ తేదీ – ఇస్లాంనగర సమీపం
వేకువనే డ్రెయిన్లలో స్వచ్చభటుల విన్యాసం
రోడ్ల మురుగు, కాల్వ తుక్కు – పేరుకొన్న కల్మషం
చల్లపల్లి కార్యకర్త సేవకేది అనర్హం?

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *