స్వచ్ఛ సుందర చల్లపల్లి – 07/02/2019 (1549* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

మంచు వలన కన్ను పొడుచుకున్నా కాస్త దూరం కూడా కనపడని వేళలో స్వచ్ఛ సేవ 1549*వ రోజు

              ఉదయం 4:15 నిముషాల నుండి 6.30 నిముషాల వరకు 28 మంది కార్యకర్తలు
మేకలడొంక నుండి శివరామపురం రోడ్డులో నిన్న ముగిసిన చోట నుండి రోడ్డుకు ఎడమ వైపు ఉన్న కలుపు మొక్కలను తీసి, చెత్తను ట్రాక్టర్ లో డంపింగ్ యార్డ్ కు తరలించారు.

                  కొంతమంది కార్యకర్తలు గతంలో పెట్టిన సువర్ణ గన్నేరు, బోగన్న్విలియా మొక్కలకు కర్రలను కట్టి, పాదులు చేశారు.

                 మరి కొంతమంది కార్యకర్తలు కంతేటి చంద్రశేఖరరావు గారి ఇంటి వద్ద ఉన్న రద్దును తీసి నాగాయలంక రోడ్డులో రోడ్డు పక్కన ఉన్న పెద్ద గుంటను పూడ్చటానికి అందులో వేశారు.

 స్వచ్చ కార్యకర్త ‘మెకానిక్ కృష్ణ’ గారు చెప్పిన నినాదాలతో ఈనాటి స్వచ్చ కార్యక్రమం ముగిసింది.

 స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 508వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు శివరామపురం రోడ్డు లో నేటి కార్యక్రమం ముగిసిన చోట కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసంమనం ట్రస్టు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
గురువారం – 07/02/2019.

              *ఆగమించిన శుభముహుర్తం*
ప్రమాదాలను పరిహసిస్తూ-ప్రమోదాలను స్వాగతిస్తూ
గ్రామజనులను ఆవహిస్తూ-స్వచ్చ సేవల దారికాస్తూ-
వేల దినములు ప్రయాణించిన స్వచ్చభటులను అనుకరిస్తే
స్వచ్చ సుందర చల్లపల్లికి శుభముహూర్తం వచ్చినట్లే!

– నల్లూరి రామారావు
‘మనకోసం మనం’ ట్రస్టు సభ్యులు
చల్లపల్లి.

14.15 కు శివారాంపురం రోడ్డులో1 (2) 1 (5) 1 (6) 1 (7) 1 (9) 1 (10) 1 (11)పడమర వీధిలో రద్దు ఎత్తుతున్నారు1 (12) 1 (13) 1 (14) 1 (15)ఆడివిలావున్న ప్రాంతం శుభ్రం చేస్తున్నారు1 (17) 1 (18) 1 (19) 1 (20) 1 (21) 1 (22) 1 (23) 1 (24) 1 (26) 1 (27) 1 (28) 1 (29)

1 (2) 1 (5) 1 (6) 1 (8) 1 (11) 1 (13) 1 (15) 1 (16) 1 (18) 1 (20) 1(22) 1(23) 1(24)1 (7) 1 (12) 1 (21)శుభ్రం చేసి మొక్కలకు పాదులు తీసిన తరువాతNRN Groupస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 1 (3) 1 (4) 1 (5) 1 (8) 1 (10) 1 (11) 1 (12) 1 (13) 1 (15)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *