గౌరనీయులైన చల్లపల్లి స్పెషల్ ఆఫీసరు గారైన తహసీల్దారు గారికి,

Sakshi

చల్లపల్లి,

06.02.2019

గౌరనీయులైన చల్లపల్లి స్పెషల్ ఆఫీసరు గారైన తహసీల్దారు గారికి,

నమస్కారములు.

ఈ రోజు సాక్షి దిన పత్రిక లో చల్లపల్లి మురుగు పారుదల వ్యవస్థపై వచ్చిన వార్తను మీరు చూసే ఉందురు.

స్వచ్చ కార్యకర్తలు కూడా చల్లపల్లి పారిశుద్ధ్య వ్యవస్థపై ఆందోళన పడుతున్నారు.

క్యారీ బ్యాగులు, టీ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, వక్కపొడి, షాంపూ ప్యాకెట్లు , కొబ్బరి బోండాలు డ్రైన్లలో పడవేయటం వలన అవి పూడుకుపోతున్నాయి.

డ్రైన్లను శుభ్రపరచుటకు  డ్రైన్ల పైన, డ్రైన్ల ముందు ఉన్న ఆక్రమణలు అడ్డుగా ఉంటున్నాయి.

మా అభ్యర్ధనలు:

  1. 1. డ్రైన్ల పైన, రోడ్డు మార్జిన్ల నుండి డ్రైన్ల వరకు ఉన్న ఆక్రమణలను తొలగించవలెను.
  2. 2. Periodical గా డ్రైన్ల లో ఉన్న silt ను తొలగించవలెను.

3 క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ గ్లాసులను, ప్లాస్టిక్ విస్తరాకులు, తగరం విస్తరాకులను నిషేధించవలెను. విజయవాడ లాంటి అనేక పట్టణాలలో ఇప్పటికే ఈ నిషేదం అమలు జరుగుతూ ఉంది.

  1. రోడ్డు ప్రక్కన చెత్త వేయుటకు గతంలో సిమెంటు వరలు లాంటివి ఉండేవి. ఆ ప్రాంతాలు చెత్తకు కేంద్రాలుగా ఉండడంతో వాటిని 4 సంవత్సరాల క్రితమే చల్లపల్లి లో తొలగించి Bin free village గా మార్చడం జరిగింది. మళ్లీ కొత్తగా కొన్ని చోట్ల ఈ వరలు కనిపిస్తున్నాయి. వీటిని తొలగించవలసినదిగా మా విజ్ఞప్తి.
  2. ప్రతి ఇంటికి రెండు రోజులకొక సారి చెత్తను సేకరించే వ్యవస్తను వెంటనే ఏర్పాటు చేయవలసినదిగా కోరుచున్నాము.

 అనేక మంది స్వచ్చ కార్యకర్తలు తమ “సమయాన్ని, శ్రమను, ధనాన్ని” గత 4 సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతూ చల్లపల్లిని స్వచ్చ సుందర చల్లపల్లి గా మార్చడానికి చేసే ప్రయత్నానికి మీ వంటి అధికారులు ఎంతోమంది సహకరిస్తున్నారు. మీరు పై అభ్యర్ధనలను వెంటనే అమలు చేయగలరని ఆశిస్తూ …

ఇట్లు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు.

 

 

 

 

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *