స్వచ్ఛ సుందర చల్లపల్లి – 08/02/2019 (1550* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం-1550*వ రోజు

                       ఉదయం 4:12 నిముషాల నుండి 6.30 నిముషాల వరకు 30 మంది కార్యకర్తలు
శివరామపురం రోడ్డులో నిన్న ముగిసిన చోట నుండి రోడ్డుకు ఎడమ వైపు ఉన్న కలుపు మొక్కలను తీసి, చెత్తను ట్రాక్టర్ లో డంపింగ్ యార్డ్ కు తరలించారు.

కొంతమంది కార్యకర్తలు గతంలో పెట్టిన సువర్ణ గన్నేరు, బోగన్న్విలియా మొక్కలకు కర్రలను కట్టి, పాదులు చేశారు.

మరి కొంతమంది కార్యకర్తలు కంతేటి చంద్రశేఖరరావు గారి ఇంటి వద్ద ఉన్న రద్దును తీసి నాగాయలంక రోడ్డులో రోడ్డు పక్కన ఉన్న పెద్ద గుంటను పూడ్చటానికి అందులో వేశారు.

స్వచ్చ కార్యకర్త BSNL ‘నరసింహరావు’ గారు చెప్పిన నినాదాలతో ఈనాటి స్వచ్చ కార్యక్రమం ముగిసింది.

 స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 509వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు గవర్నమెంట్ హాస్పటల్ వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసంమనం ట్రస్టు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
శుక్రవారం – 08/02/2019.

              *శోభనిచ్చిన శుభముహూర్తం*
మంచు దుప్పటి కాలమందో- మండుటెండల గ్రీష్మమందో
వానముసరిన- మురుగుకాల్వలు దారి తప్పిన వేళలందో
గ్రామ ప్రజలీ స్వచ్చ సైనిక ప్రజాసేవల దారికొస్తే
స్వచ్చ సుందర చల్లపల్లికి మంచిరోజులు వచ్చినట్లే!

-నల్లూరి రామారావు
‘మనకోసం మనం’ ట్రస్టు సభ్యులు
చల్లపల్లి.

14.12 కు శివరాంపురం రోడ్డులో1 (3)1 (1)1 (29) 1 (27)1 (25) 1(33) 1 (26)1 (24)పడమమర వీధిలో రద్దు ఎత్తుడు పూర్తికావచ్చింది 1 (22)కన్నుల పండుగగా స్వచ్ఛ సేవ 1 (20)1 (18)1 (17) 1 (16) 1 (15) 1 (14) 1 (13) 1 (12)1 (10) 1 (9) 1 (8) 1 (7) 1 (6)చంద్రశేఖర్ గారి ఇంటివద్ద ఉన్న రద్దును ఎత్తడానికి బయలుదేరుతూ 1 (5) 1 (4) 1 (2)1 (3) 1 (4) 1 (5)శుభ్రం చేసిన తరువాత1 (6) 1 (7) 1 (10) 1 (11) 1 (12) 1 (13)విరగపూసిన సువర్ణ గన్నేరు మొక్క పూలు1 (14) 1 (16) 1 (17) 1 (18) 1 (19) 1 (20) 1 (21) 1 (23) 1 (24) 1 (25) 1 (27) 1 (28) 1 (29)

NRN Groupస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 1 (1) 1 (2) 1 (3) 1 (4)1 (6) 1 (7) 1 (8) 1 (9) 1 (10) 1 (12) 1 (13)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *