స్వచ్ఛ సుందర చల్లపల్లి – 25/04/2019 (1626* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1626* వ రోజు

     ఉదయం 4:06 నిముషాల నుండి 6.10 నిముషాల వరకు 38 మంది కార్యకర్తలు బైపాస్ రోడ్డు ఇరువైపులా, బైపాస్ రోడ్డు లోని రెండవ వీధి శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్ లో లోడు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు. ఒక చోట డ్రైనేజి డంపింగ్ యార్డ్ వలె తయారైంది. ఆ ప్రాంతాన్ని కొంతమంది కార్యకర్తలు శుభ్రం చేశారు.

కొంత మంది కార్యకర్తలు సాగర్ టాకీస్ గోడకి బొమ్మలు వేశారు. ఆ ప్రాంతం మరింత అందంగా తయారైంది.

మరికొంతమంది కార్యకర్తలు బైపాస్ రోడ్డు లోని రహదారి వనాలలోని మొక్కలకు పాదులు చేసి, కర్రలు కట్టారు.

 స్వచ్చ కార్యకర్త ‘ ఆకుల దుర్గా ప్రసాద్ ’ గారు చెప్పిన నినాదాలతో ఈనాటి కార్యక్రమం ముగిసింది.

 స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 585వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు బైపాస్ రోడ్డు లో పాల కేంద్రం వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్టు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
గురువారం – 25/04/2019.

*పిచ్చి వాళ్ల స్వర్గమేనా ఇది?*
అమెరికాలో తెలుగు వారికి-ఆంధ్రదేశపు చల్లపల్లికి
గోదావరి కడ గొల్లప్రోలుకు-శివరామపురం మేకల డొంకకు
లంకె వేసిన-ఆకర్షించిన-లబ్ది పొందిన-వాసికెక్కిన
స్వచ్చ సుందర సేవలన్నీ పిచ్చి వాళ్ల స్వర్గమేనా?
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి.

14.06 కు బై పాస్ రోడ్దు లో1 (4)వంకరగా వున్న నారాయణరావు నగర్ బోర్డు1 (6) 1 (9)వంకరగా వున్న నారాయణరావు నగర్ బోర్డును సరిచేస్తున్న కార్యకర్తలు1 (1)నారాయణ రావు నగర్ బోర్డు ను సరిచేసిన తరువాత1 (2) 1 (3) 1 (5) 1 (7) 1 (8) 1 (11)1 (10)1 (11) 1 (34)రహదారి వనంను మరింత పరిశుభ్రంగా చేస్తున్న కార్యకర్తలు1 (3) 1 (4)1 (8)1 (12)1 (1)గోడకు వేసిన రంగులు మెరుగులు దిద్దుతున్నారు1 (14)గురుశిష్యులు సీతాకోకచిలుక బొమ్మ వేస్తున్నారు1 (27)1 (6)1 (19) 1 (23) 1 (24) 1 (32)1 (30) 1 (37)NRN Groupస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 1 (3) 1 (4) 1 (6)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *