స్వచ్ఛ సుందర చల్లపల్లి – 26/04/2019 (1627* వ రోజు)

Group 1

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1627* వ రోజు

    ఉదయం 4:08 నిముషాల నుండి 6.10 నిముషాల వరకు 36 మంది కార్యకర్తలు బైపాస్ రోడ్డు లోని పాల కేంద్రం వద్ద రోడ్డు కు ఇరువైపులా శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్ లో లోడు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు.

కొంత మంది కార్యకర్తలు బైపాస్ రోడ్ లోని భారత లక్ష్మీ రైస్ మిల్ వద్ద ఉన్న గోడకు రంగులు వేయడానికి గోడను శుభ్రం చేశారు.

మరికొంతమంది కార్యకర్తలు బైపాస్ రోడ్డు లోని రహదారి వనాలలోని మొక్కలకు పాదులు చేసి, కర్రలు కట్టారు.

  కట్టా పద్మావతి గారు నారాయణ రావు నగర్ లో రేపు సాయంత్రం జరగబోయే వారి చెల్లెలి వివాహానికి కార్యకర్తలందరినీ ఆహ్వానించారు.

స్వచ్చ కార్యకర్త ‘కట్టా పద్మావతి’ గారు, బాల కార్యకర్తలు ‘ఆర్య, ఆరవ్’ లు చెప్పిన నినాదాలతో ఈనాటి కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 586వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు అగ్రహారంలో పంచాయితీ ఆఫీస్ వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్టు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
శుక్రవారం – 26/04/2019.

            *పిచ్చి వాళ్ల స్వర్గమా ఇది *
సకాలంలో చల్లపల్లికి స్వచ్చ సేవలు మొదలు పెట్టిన
స్వచ్చ సేవను వేల దినములు సజీవంగా నడపగలిగిన
సృజననూ- నిస్వార్ధ కృషినీ సమర్ధంగా మేళవించిన
చల్లపల్లి స్వచ్చ సేవలు పిచ్చివాళ్ల స్వర్గమేనా?
 -నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి.

14.08 కు పాల కంపెనీ వద్ద1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (6)1 (9) 1 (10) 1 (11) 1 (12)1 (19)1 (23)1 (15)1 (8) 1 (13)1 (3) 1 (4) 1 (10) 1 (21)1 (1) 1 (6) 1 (7) 1 (11) 1 (14) 1 (16) 1 (17) 1 (18) 1 (20) 1 (22) 1 (24)NRN Groupస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 1 (2) 1 (3) 1 (7)

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *