స్వచ్ఛ సుందర చల్లపల్లి – 27/04/2019 (1628* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1628* వ రోజు

ఉదయం 4:00గంటల నుండి 6.10 నిముషాల వరకు 42 మంది కార్యకర్తలు అగ్రహారం లోని పంచాయితీ ఆఫీస్ వద్ద నుండి వీధులను శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్ లో లోడు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు.

కొంత మంది కార్యకర్తలు బైపాస్ రోడ్ లోని భారత లక్ష్మీ రైస్ మిల్ వద్ద ఉన్న గోడకు రంగులు వేశారు.

కొంతమంది కార్యకర్తలు అగ్రహారంలో ఉన్న డ్రైనేజి ని శుభ్రం చేశారు.

మరికొంతమంది కార్యకర్తలు పంచాయితీ ఆఫీస్ వద్ద ఒరిగిపోయి ఉన్న పంచాయితీ ఆఫీస్ బోర్డు ను సరిచేశారు.

బాల కార్యకర్తలు ‘ఆర్య, ఆరవ్’ లు చెప్పిన నినాదాలతో ఈనాటి కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 587వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్టు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
శనివారం – 27/04/2019.

  *పిచ్చి వాళ్ల స్వర్గమా ఇది.*
చల్లపల్లి స్వచ్చ సేవల కర్త-కర్మ-క్రియలు తానై
త్యాగ పూర్వక-వినయ వినమిత గ్రామ సేవల ఉదాహరణై
పాతికూళ్లకు స్పూర్తినిచ్చిన-ప్రభుత్వామోదమూపొందిన
చల్లపల్లి స్వచ్చ సేవలు పిచ్చి వాళ్ల స్వర్గమేనా?

     -నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి.

14 గంటలకు పంచాయితీ ఆఫీస్ వద్ద1 (6)వంకరగా ఉన్న బోర్డు ను సరిచేస్తున్న కార్యకర్తలు1 (14)1 (13)పంచాయితీ ఆఫీస్ బోర్డు ను సరిచేసిన తరువాత1 (4)Drain శుభ్రమ్ చేసిన కార్యకర్తలు1 (4)గోడకు రంగులు వేస్తున్న సుందర బృందం1 (19) 1 (29)

1 (11) 1 (12)

1 (9) 1 (18) 1 (30) 1 (31) 1 (33) 1 (34) 1 (36) 1 (38) 1 (40) 1(46)NRN Groupస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 1 (2) 1 (3) 1 (6) 1 (8) 1 (9)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *