స్వచ్ఛ సుందర చల్లపల్లి – 23/05/2019 (1654* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1654* వ నాటి విశేషాలు.

ఈ వేకువ 4.05 నిముషాల నుండి 6.05నిముషాల వరకు-
1) నడకుదురు దారిలోని మెహెర్ వడ్ల మిల్లు కు తూర్పు గాను, 2) నారాయణ రావు నగర్ లోను, మొత్తం 39 మంది కార్యకర్తలు గ్రామ సేవలందించారు.

నడకుదురు దారి రెండు ప్రక్కల మార్జిన్ స్తలంలోను, డ్రైన్లలోను, పిచ్చి మొక్కలు, ఎండు గడ్డి, ఎంగిలి విస్తర్లు, ప్లాస్టిక్ సంచులు, అనేకానేక ఇతర వ్యర్ధాలను నరికి-ఏరి-ఊడ్చి, ఖాళీ మద్యం సీసాలను సమీకరించి, ట్రాక్టర్ కెత్తి, డంపింగ్ యార్డు కు తరలించారు.

గ్రామ వీధులందలి గోడలను సుందరీకరించే పట్టుదలను కొనసాగిస్తూ సుందరీకరణ బృందం మెహెర్ మిల్లు ప్రహరీ గోడను తడిపి, గీకి, రంగులతో అందగించే కృషిని నేడు కూడా కొనసాగించారు.

మరొక నాల్గు రోజుల తర్వాత ఈ స్వచ్చ కార్యకర్తల కృషి ఫలితం నడకుదురు రోడ్డు అందం చూడవచ్చు.

గత నాలుగైదేళ్ళ స్వచ్చ శ్రామికుల మహా కృషి చక్కగా సమీక్షించిన నాగ శేషు కొన్ని పాటలు కూడా వినిపించారు.

ఆ ప్రాంతం లో నివశిస్తున్న టైలర్ శివ రామ కృష్ణ గారు స్వచ్చ కార్యకర్తలందరికి తమ పెరడులోని ములగ కాయలు పంచారు.

అడపా గురవయ్య గారి స్వచ్చ సంకల్ప నినాదాలతో, పెద్దల సూక్తులతో నేటి స్వచ్చ సేవ కృషి 6.35 నిముషాలకు ముగిసింది.

612*వ రోజుకు చేరిన నారాయణరావునగర్ వారి స్వచ్చ సేవలకు అభినందనలు.

రేపటి స్వచ్చ సేవలు కూడా నడకుదురు మార్గంలోనే.

.        *మార్పు కోసం స్వచ్చ జైత్ర యాత్రలు.*
వందలాదిగ-వేన వేలుగ-వచ్చిరోజులు పోవుచున్నవి
ఎవరి కోసం స్వచ్చ సేవలొ వారిలో ఏ మార్పులున్నవి?
ప్రతి ఫలాపేక్షా లేకుండా గ్రామ సౌఖ్యమె ఆశయంగా
స్వచ్చ వీరుల జైత్ర యాత్రలు సాగె నీ ఐదేళ్ల నుండీ!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
గురువారం-23/05/2019
చల్లపల్లి.

14.05 కు నడకుదురు రోడ్డు లో రైస్ మిల్లు వద్ద1 (6) 1 (7) 1 (8) 1 (12) 1 (17) 1 (18)1 (13)1 (4)1 (42)రంగువేయడం పూర్తియైన వంతెన గోడ1 (40)రంగు వేయక ముందు 1 (11)రంగు వేసిన తరువాత1 (23)రంగు వేయక ముందు 1 (30)రంగు వేసిన తరువాత1 (29)1 (10) 1 (14)1 (27)ఊళ్లోకీ కొత్తగా వచ్చిన రంగుల వాళ్లు1 (1) 1 (2)ఆడుతూ పాడుతూ పనిచేస్తూ1 (6) 1 (15) 1 (16) 1 (19) 1 (24) 1 (31) 1 (41) 1 (46)సైడుకాలువలో శుభ్రం చేస్తున్నారుNRN Groupనారాయణ రావు నగర్ కార్యక్రమాలు1 (1) 1 (4) 1 (6)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *