స్వచ్ఛ సుందర చల్లపల్లి – 24/05/2019 (1655* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 1655*వ నాటి ఉద్యమ విశేషాలు.

ఈ ఉదయం 4.02 నిముషాల నుండి 6.05 నిముషాల మధ్య మొత్తం 37 మంది స్వచ్చ కార్యకర్తల గ్రామ సేవలు చోటు చేసుకున్నవి.

నడకుదురు మార్గంలో మెహెర్ వడ్ల మరకు, తూర్పున దారి కిరువైపుల గల ఖాళీ లోను, కాలువ లోను, ఖాళీ మద్యం సీసాలు, పిచ్చి కంపలు, ప్లాస్టిక్ సంచులు, ఎంగిలాకులు, తదితర గృహ వ్యర్ధాలను, ఏరి-నరికి-ఊడ్చి- ట్రాక్టర్ కెత్తి, డంపింగ్ కేంద్రానికి తరలించారు.

ధాన్యం మిల్లు ప్రహరీ గోడను తుడిచి, గోకి, తడిపి, ముందుగా ప్రైమర్ వేసే సుందరీకరణ కృషి నేడు కూడా కొనసాగింది.

స్వచ్చ కార్యకర్తలను ఉత్సాహపరిచే తన పాటను నాగ శేషు నేడు కూడా వినిపించాడు.

తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వాసన కృష్ణా రావు గారు కార్యకర్తలకు స్వల్పహార విందునిచ్చి, ‘మనకోసం మనం’ ట్రస్టుకు1,120/- విరాళ మిచ్చినందుకు ధన్యవాదములు. వీరికి కార్యకర్తలందరి తరపున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

నేటి స్వచ్చ సేవ 6.30 నిముషాలకు బాల కార్యకర్త దేసు జాహ్నవి స్వచ్చ సంకల్ప నినాదాలతో ముగిసింది.

చల్లపల్లి లోని మిగిలిన వార్డులన్నిటికి మార్గదర్శకమైన తమ నిర్విరామ స్వచ్చంద సేవలను నారాయణ రావు నగర్ కార్యకర్తలు 613*వ నాడు కూడా కొనసాగించారు.

రేపటి ఔత్సాహిక గ్రామ సేవ నడకుదురు మార్గంలోనే.

*(19.5.2019) స్వచ్చ సేవల సాక్షి ద్వయం.*
సకారాత్మ-సాధికార స్వచ్చ సైన్య మాన్యులార!
అశేషాంధ్ర జాగృత జన ఆప్తులార! దీప్తులార!
బ్రాంచి పంట కాల్వలోని వ్యర్ధాల విమోచన కై
సూర్య చంద్రు లొకే సారి చూచిరి మీ స్వచ్చ సేవ!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
శుక్రవారం-24/05/2019
చల్లపల్లి.

14.02కు నడకుదురు రోడ్డులో1 (2) 1 (3) 1 (4) 1 (6) 1 (8) 1 (10) 1 (11)1 (7)1 (5)వంతెన గోడ రంగు వేయకముందు1 (13)రంగు వేయక ముందు1 (58)1 (4) 1 (50)1 (57)1 (54)రంగు వేసిన తరువాత1 (55)1 (3) 1 (6)అడ్డంగా ఉన్న కొమ్మను తొలగించారు1 (11) 1 (13) 1 (15) 1 (19) 1 (21) 1 (24) 1 (25) 1 (26) 1 (29) 1 (36) 1 (43) 1 (44) 1 (49) 1 (51) 1 (52) 1 (22) 1 (37)శుభ్రంగా ఉన్న నడకుదురు రోడ్డుNRN Groupనారాయణ రావు నగర్ కార్యక్రమాలు1 (1) 1 (2) 1 (4) 1 (6) 1 (9)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *