స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03/06/2019 (1665* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 1665*వ నాటి ముచ్చట్లు.

ఈ ఉషోదయానికి ముందే

1) చల్లపల్లి సెంటరు దగ్గరి మూడు ప్రధాన మార్గాలు,

                      2) నారాయణరావు నగర్ ఒక వీధిలో 40 మంది స్వచ్ఛ సేవకుల నిర్ణీత గ్రామ సేవలు జరిగినవి.

చల్లపల్లి సెంటరు నుండి సంత బజారు దాక, పొట్టి శ్రీ రాములు వీధి వరకు, అటు విజయవాడ రహదారి కొంత భాగంలో ఇరుప్రక్కల ఉన్న దుమ్ము, ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్ధాలను, ఏరి, ఊడ్చి ట్రాక్టర్ కెత్తి, చెత్త కేంద్రానికి తరలించారు. గ్రంధాలయం దారిలోని పాత గోనె సంచులు, దుమ్ము ఊడ్చి ఏ.టి.యం. ప్రాంతాన్ని శుభ్రపరచడంతో వీధులు వెడల్పుగా, స్వచ్చంగా రూపొంది, ‘శ్రమ యేవ జయతే’ అనే నానుడి గుర్తొస్తున్నది.

శ్రీ సత్య సాయి ధ్యాన మండలి సభ్యులు నేటి కార్యక్రమంలో పాల్గొన్నారు.

”మనకోసం మనం” సంస్థకు నారంశెట్టి వేంకటేశ్వర రావు గారు 1500/-, రాయపాటి రాధాకృష్ణ దంపతులు 1000/-, కోడూరు వేంకటేశ్వరరావు గారు 520/- సమర్పించి, దాతృతను చాటు కొనడం అభినందనీయం. ఎరువులు, పురుగు మందులు వాడని చెట్టు తయారీ మామిడి పళ్లను సాటి కార్యకర్తలకు పంచిన సీనియర్ కార్యకర్తకు గూడ మన్ననలు!

స్పందనపై స్పందన: నీటి కాలువల, వనరుల పరిశుభ్రత కోసం కలెక్టర్ గారి పిలుపుకు స్పందనగా చల్లపల్లి కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో చేసిన కృషిపైన కలెక్టర్ ఇంతియాజ్ గారు వెను వెంటనే స్పందించి డా. D.R.K.ప్రసాదు గారితో మాట్లాడి మంగళవారం చల్లపల్లి సందర్శనకు వస్తానని చెప్పారు.

జుఝవరపు ప్రశాంత మణి గారి స్వచ్ఛ సంకల్ప నినాదాలతో నేటి గ్రామ సేవలకు స్వస్తి.

 నారాయణరావు నగర్ కార్యకర్తల నిరాటంక దిగ్విజయ సేవలు 624*వ నాడు యధావిధిగా జరిగాయి. 

రేపటి స్వచ్చ గ్రామ కృషి బందరు మార్గంలోని కీర్తి హాస్పటల్ నుండి సంత బజారు వైపు.           

         -నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త 
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
సోమవారం – 03/06/2019
చల్లపల్లి.
1 1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (6) 1 (7) 1 (8) 1 (9) 1 (10) 1 (11) 1 (12) 1 (13) 1 (14) 1 (15) 1 (16) 1 (17) 1 (18) 1 (19)
Group 1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (6) 1 (7) 1 (8) 1 (9) 1 (10) 1 (11) 1 (12) 1 (13) 1 (14) 1 (15) 1 (16) NRN Group 1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (6) 1 (7) 1 (8) 1 (9) 1 (10) 1 (11) 1 (12)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *