స్వచ్ఛ సుందర చల్లపల్లి – 04/06/2019 (1666* వ రోజు)

1

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 1666*వ నాటి ముచ్చట్లు.

ఈ వేకువ 4.00 – 6.00 మధ్య 40 మంది కార్యకర్తలు 3 చోట్ల గ్రామసేవలందించారు. కీర్తి వైద్యశాల నుండి తూర్పు రామాలయం వరకు బందరు దారికిరువైపుల దుమ్ము, ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఎండుటాకులు, ఏరి, ఊడ్చి, ట్రాక్టర్ కెత్తి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు. ఆ మార్గమంతా శుభ్రంగా, విశాలంగా కనిపిస్తున్నది.

సుందరీకరణ బృందం కమ్యూనిస్ట్ బజారులోని ప్రహరీ గోడల అందాలకు మెరుగులు దిద్దారు.

బాల కార్యకర్తలు ఆర్య, ఆరవ్ లు చెప్పిన నినాదాలతో నేటి స్వచ్చ సేవ ముగిసింది.

నారాయణరావునగర్ లో స్వచ్చ సేవలు 625* వ నాడు కొనసాగాయి. తుమ్మల జనార్ధనరావు గారు తమ 76 వ పుట్టినరోజు సంధర్భంగా అందించిన 6,000/- విరాళానికి ధన్యవాదాలు, కార్యకర్తలందరూ జనార్ధనరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

రేపటి స్వచ్చ గ్రామ సేవ కోమలా నగర్ లో. విజయా కాన్వెంట్ వద్ద కలుసుకుందాం.

కృష్ణా జిల్లా కలెక్టర్ గారి సందర్శన :

స్వచ్చ చల్లపల్లి పట్ల అభిమానంతో, ఆసక్తితో మహ్మద్ ఇంతియాజ్ గారు 9.40 నుండి 11.55 వరకు గ్రామంలో పర్యటించి, 4 1/2 ఏళ్ల స్వచ్చోద్యమాన్ని పదేపదే అభినందించి, డంపింగ్ యార్డును సందర్శించి, కార్యకర్తలతో ఫోటో దిగారు.

MRO ఆఫీసులో చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలతో సమావేశమై, గ్రామానికి పంచాయితీ ద్వారా జరగవలసిన కృషిని గూర్చి చర్చించి, అధికారులకు సూచనలు చేశారు.

చల్లపల్లి లో జరిగే స్వచ్చంద కృషిలో ఏ కొంత జరిగినా జిల్లాలోని 970 పంచాయితీలు మార్పు చెంది అద్భుతంగా ఉంటాయని, జిల్లా మొత్తం మారిపోతుందని ఆశించారు. తదుపరి ఈ గ్రామానికి కలెక్టర్ గారు చేయదగిన కొన్ని పనులను Dr. D.R.K. ప్రసాదు గారు ప్రతిపాదించారు. విజయవాడ రోడ్డును, బైపాస్ రోడ్డును, గంగులవారిపాలెం దారిని పరిశీలించి పద్మావతి హాస్పిటల్ ను, పద్మాభిరామాన్ని చూశారు.

Md. ఇంతియాజ్ గారి చల్లపల్లి సందర్శన, అభినందన స్వచ్చ కార్యకర్తలకు మరింత ఉత్తేజాన్నిచ్చింది.

మున్ముందు వారి వలన మన గ్రామం మరింతగా స్వచ్చ సుందరంగా మారుతుందని ఆశించవచ్చు.

*మంచి దశకొచ్చేసినట్లే*
విసుగు దేనికి? మనం నమ్మిన స్వచ్చ సేవా ప్రగతి పూర్తికి
మరింతగ అభినివేశంతో ప్రగతి తోడమమేకమైతే
జనం మన కృషి గౌరవిస్తే – స్వాగతిస్తే – సంచలిస్తే
స్వచ్చ సుందర చల్లపల్లికి మంచి దశ వచ్చేసినట్లే!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
మంగళవారం – 04/06/2019
చల్లపల్లి.

2ఉదయం 4 గంటలకు SBI వద్ద 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

Tummala Janardhanarao garuతుమ్మల జనార్ధనరావు గారు తమ 76 వ పుట్టినరోజు సంధర్భంగా అందించిన 6,000/- విరాళానికి ధన్యవాదాలు.19 21 22 23 24 25కలెక్టర్ గారికి జనపనారతో చేసిన స్వచ్చ చల్లపల్లి సంచిని బహుమతిగా ఇచ్చారు.  26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *