స్వచ్ఛ సుందర చల్లపల్లి – 05/06/2019 (1667* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1667*వ నాటి సంగతులు.

ఈ ప్రాతః సమయం 3.58 – 6.05 నిముషాల మధ్య గ్రామం3 విభాగాలలో 43 మంది కార్యకర్తలు సేవలు జరిగినవి.

కోమలా నగర్ 5 వ వీధి- కోడూరు, రావూరి ల గృహ ప్రాంతం లో ఇద్దరు స్థానికులు కలిసి రాగా పిచ్చి మొక్కలు నరికి, ప్లాస్టిక్ సంచులు, ఎండుటాకులు, దుమ్ము, ఇతర వ్యర్ధాలను ఊడ్చి, ఏరి, ట్రాక్టర్ కెత్తి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు. ఒక ఖాళీ స్థలాన్ని పాక్షికంగా, మరొకదాన్ని పూర్తిగా శుభ్రపరిచారు.

కమ్యూనిస్ట్ బజారు దగ్గరి గోడలకు రంగుల చిత్ర లేఖనాల సుందరీకరణ ముగిసింది. ప్రస్తుతం అది చూసి ముచ్చట పడుతున్న గ్రామస్తులు ఇక ముందు సెల్ఫీ లు గూడ దిగవచ్చు.

నారాయణ రావు నగర్లో 626*వ నాటి స్వచ్ఛ సేవ ఉత్సాహంగా సాగింది.

లయన్స్ క్లబ్ వారు నేటి గ్రామ సేవలో పాల్గొన్నారు. కస్తూరి వర ప్రసాద్ గారు ”మన కోసం మనం” ట్రస్టుకు 1500/- సమర్పించి, రేపు జరగబోయే వారి ఉచిత ఆరోగ్య పరీక్షలను కార్యకర్తలకు గుర్తు చేసినందుకు స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.

డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు నిన్నటి కలెక్టర్ గారి చల్లపల్లి పర్యటనలోని సానుకూల అంశాలను విశ్లేషించారు.

కోమలా నగర్ లోని ఒక ఉపాధ్యాయిని తన ఇంటి ప్రక్కన సేవలందిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలకు ఫలాహార మందించినందుకు ధన్యవాదములు.

బాల కార్యకర్తల జంట ఆర్య, ఆరవ్ ల స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలతో 6.35 నిముషాలకు నేటి గ్రామ సేవల ముగింపు.
రేపటి స్వచ్చంద సేవలకై విజయా కాన్వెంట్ వద్ద కలుసుకుందాం.
*స్వచ్ఛ సైన్యం వందనమ్ములు*
ప్రజారోగ్యం ప్రధమ మనుకొని, స్వచ్ఛ శుభ్రత నభిలషిస్తూ
స్వచ్ఛ సుందర చల్లపల్లిని స్వాగతించిన- సంచరించిన-
స్వచ్ఛతకు ఒక నమూనాగా చాటి చెప్పిన- ప్రోత్సహించిన
ఇంతియాజ్ గారికి ఇవే మా స్వచ్ఛ సుందర వందనమ్ములు!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
బుధవారం – 05/06/2019
ల్లపల్లి.

13.58 కు విజయా కాన్వెంట్ వద్ద1 (1) 1 (4) 1 (5) 1 (7)1 (2) 1 (3) 1 (6)1 (3)రంగు వేయక ముందు1 (9)1 (10)రంగు వేసిన తరువాత1 (2) 1 (4) 1 (6) 1 (7) 1 (12) 1 (14) 1 (15)1 (8)విరాళం ఇస్తున్న కస్తూరి ప్రసాద్ గారు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *