స్వచ్ఛ సుందర చల్లపల్లి – 06/06/2019 (1668* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1668*వ నాటి సంగతులు.

ఈ ప్రాతః సమయం 4.08 – 6.08 నిముషాల మధ్య చల్లపల్లి లో త్రి ముఖంగా సాగిన సేవలో 36 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయ కాన్వెంట్ గేటుకు ఎదురుగా ఉన్న కోమలా నగర్ బజారు కిరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను, దుమ్మును, ఎండు తుక్కులను, ప్లాస్టిక్ సంచుల్ని నరికి- ఏరి-ఊడ్చి, ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి చేర్చారు. ఒక ఖాళీ జాగాను పూర్తి గానూ, కొన్నిటిని పాక్షికంగాను శుభ్రం చేశారు. ఇద్దరు, ముగ్గురు స్థానికులు కూడా ఇందులో కలిశారు.

సంత బజారు లోని పోలీస్ భవనాల ప్రహరీలకు ప్రైమర్, రంగులు పూసే పని ఈ రోజు సుందరీకరణ బృందం చేపట్టింది.

అబ్దుల్ హర్షతున్నీసా(చిన్ని, నారాయణ రావు నగర్ వాస్తవ్యురాలు) 500/- స్వచ్చోద్యమం కోసం మనకోసం మనం ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. వీరికి కార్యకర్తలందరి తరపున స్వచ్చోద్యమ ధన్యవాదాలు.

నారాయణ రావు నగర్ సుదీర్ఘ సేవలు 627*వ రోజుకు చేరుకున్నవి.

నెల్లూరు నుండి వచ్చి, చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని పరిశీలించిన శ్రీనివాస రెడ్డి గారు ఈనాటి సేవలలో పాల్గొని, ప్రత్యక్షంగా గమనించి, కార్యకర్తల నభినందించారు. తన సొంత ఊరిలో కూడా ఇదే ఉద్యమాన్ని నడిపి, స్వచ్ఛ సుందరీకరణ సాధించాలనే తన ధృఢ సంకల్పాన్ని ప్రకటించారు.

వాసన కృష్ణారావు గారు ముమ్మారు నినదించిన స్వచ్ఛ సంకల్పంతో 6.40కు నేటి స్వచ్చంద గ్రామ సేవకు స్వస్తి.
రేపటి స్వచ్ఛ కృషి కూడ కోమలానగర్ లోనే. విజయా కాన్వెంట్ దగ్గర కలుద్దాం.
*కర్మణ్యేవాధికారస్తే*
సుందరీకరణ బృందం సృజన శీలమగు యోచన
చల్లపల్లి అణువణువున సౌందర్యారాధన
మరి- కదలి ముందు కొచ్చేనా గ్రామ జనుల చేతన?
కర్మణ్యేవాధి కారః మాఫలేషు కదాచన!
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
గురువారం – 06/06/2019
చల్లపల్లి.

14.08 కు విజయా కాన్వెంట్ వద్ద1 (1) 1 (3)1 (4)1 (13)నిన్న రంగు వేయక ముందు గోడ1 (3) 1 (19)1 (7) 1 (14)బైపాస్ రోడ్డులో పోలీస్  క్వార్టర్స్ వద్ద సుందరబృందం చిత్రలేఖనాలు1 (2)నేడు రంగు వేయడం పూర్తయిన తరువాత1 (5)శ్మశానం దగ్గర నిర్మాణంలో ఉన్న ఆర్చ్1 (1) 1 (9) 1 (10) 1 (11) 1 (18)నెల్లూరు నుంచి వచ్చిన శ్రీనివాస రెడ్డి గారు స్వచ్చ కార్యక్రమం గురించి మాట్లాడుతూ కార్యకర్తలను అభినందించారు.NRN Groupనారాయణ రావు నగర్ కార్యక్రమాలు1 (1) 1 (2) 1 (3) 1 (5)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *