స్వచ్ఛ సుందర చల్లపల్లి – 10/06/2019 (1672* వ రోజు)

Group

 

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1672*వ నాటి విశేషాలు.

     ఈ నాటి వేకువ 4.02 – 6.05 నిముషాల మధ్య గ్రామంలోని 3 రోడ్ల సెంటర్ లో, నారాయణ రావు నగర్ లో స్వచ్చ సేవలు జరిగినవి. 40 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సెంటరు నుండి విజయవాడ రోడ్డు వైపు, బస్టాండు మార్గంలోను, బందరు మార్గంలోను, దుమ్మును, ప్లాస్టిక్ వ్యర్ధాలను, ఇతర చెత్తను ఊడ్చి, ఏరి, ట్రాక్టర్ కెత్తి ప్రధాన చెత్త కేంద్రానికి తరలించారు. కొందరు బందరు రోడ్డులోని పేవర్ టైల్స్ ను ట్రాక్టర్ తో అవసరమైన చోటికి చేర్చారు.

  నారాయణ రావు నగర్ లోని స్వచ్చ సేవలు 631*వ నాడు దిగ్విజయంగా జరిగాయి.

అక్కడక్కడ వెలుస్తున్న డంపింగ్ యార్డులు, ప్లాసిక్ భూతాల పట్ల దిన పత్రికల్లో వస్తున్న ప్రజల ఆందోళనల వార్తల పరిష్కారం కోసం డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు పత్రికా ప్రకటనకై తాను వ్రాసిన సూచనలను స్వచ్చ కార్యకర్తల ముందు చర్చకు పెట్టి, ఆమోదం పొందారు.

వివేకానంద కళాశాల ప్రధానాచార్యులైన కోటేశ్వర రావు మాష్టారు ముమ్మారు చేసిన స్వచ్చ సంకల్ప నినాదాలతో 6.35 నిముషాలకు నేటి గ్రామ సేవలు ముగిశాయి. వీరే విజయవాడలో తాము నిర్మించుకొన్న నూతన గృహ ప్రవేశానికి (13.3.19 ఉదయం) కార్యకర్తలనాహ్వానించి, స్వచ్చ చల్లపల్లికి వారి కుటుంబ సభ్యుల తరపున 5116/-విరాళం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

రేపటి స్వచ్చ సేవలకై వికాస కేంద్రం దగ్గర కలుద్దాం.

    *సామ గానం*
చల్లపల్లి స్వచ్చ సైన్య సుదీర్ఘ సేవల ప్రయాణం
అది మహోత్తమ సామవేదం- అది సలక్షణ కవిత్వం
అది సమున్నత వ్యావసాయక సకారాత్మక ప్రయత్నం
ఏ విధంగా తరచి చూచిన ఇదే సఫలం సమగ్రం!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
సోమవారం – 11/06/2019
చల్లపల్లి.

14.02 కు సెంటర్ లో1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5)1 (3) 1 (4) 1 (5) 1 (6) 1 (8) 1 (9) 1 (10)NRN Groupస్వచ్చ నారాయణ రావు నగర్ కార్యక్రమాలు1 (1) 1 (3) 1 (7) 1 (9)

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *