స్వచ్ఛ సుందర చల్లపల్లి – 21/06/2019 (1683* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1683*వ నాటి విశేషాలు.

నేటి వేకువ4.02-6.05 నిముషాల మధ్య (22+5+6+8) 41 మంది కార్యకర్తలు తమ విలువైన కాలాన్ని, శ్రమను తమ మాతృ గ్రామానికి బహుముఖంగా సమర్పించారు.

1) వికాస కేంద్రం నుండి విజయా కాన్వెంట్ వరకు, విజయవాడ మార్గానికిరువైపుల ప్లాస్టిక్ సంచులు, ఖాళీ మద్యం సీసాలు, ఎంగి లాకులు, దుమ్ము, ఏరి-ఊడ్చి-ట్రాక్టర్ కెత్తి ప్రధాన చెత్త కేంద్రానికి తరలించారు. పెట్రోల్ బంక్ ప్రక్క డ్రైను ను ఇద్దరు ముగ్గురు మురుగు నిపుణులు గంటకు పైగా రాళ్లు, సిల్టు, తుక్కు లాగి శుభ్రపరిస్తే- రెండో ప్రక్క డ్రైన్ లోని గడ్డీ-రాళ్లు-వ్యర్ధాలన్నిటిని మరికొందరు లాగారు.

2) గంగులవారిపాలెం రోడ్డులోని కట్టడాల రాతి వ్యర్ధాలను ట్రాక్టర్ కెత్తి, రోడ్ల భద్రత కవసరమైన చోట్ల కొందరు సర్దారు.

3) సంత ప్రహరీలకు ప్రైమర్ పూస్తున్న సుందరీకరణ బృందం సంతలోని ముక్కులదరగొట్టే కూరల వ్యర్ధాలను పోగులు పెట్టడం గమనార్హం. .

4) నాలుగేళ్లుగా నాటి పోషిస్తున్న ఐదారువేల చెట్లకు ట్రస్టు ఉద్యోగులు విసుగు లేకుండ నీరందిస్తూనే ఉన్నారు.

5) నారాయణరావు నగర్ కార్యకర్తల నిర్విరామ సేవలు 643* వ రోజుకు చేరుకున్నవి.

నేటి తన జన్మదినాన్ని పురస్కరించుకొని గోళ్ల రాంప్రసాద్ గారి శ్రీమతి గోళ్ల రాజేశ్వరి గారు, నిన్నటి తమ వివాహ దిన సందర్భంగా గంధం వేంకటేశ్వర రావు గారు,’మనకోసం మనం’ ట్రస్టుకు చెరొక 500/- సమర్పించిన ఔదార్యనికి చల్లపల్లి స్వచ్చోద్యమ నివాళులు.

యోగాచార్యుడు శ్రీహరి ఉచ్ఛరించిన ‘ స్వచ్ఛ సంకల్ప’ నినాదాలతో కార్యకర్తలు గొంతులు కలపడంతో 6.40 నిముషాలకు నేటి గ్రామ సేవలకు స్వస్తి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం 6వ నంబర్ కాలువ దగ్గర కలుద్దాం.

 నా వరకూ…..
ఏదో వెలితి-ప్రాభాత స్వచ్చ కృషికి వెళ్లనపుడు
అసంతృప్తి- స్వచ్చోద్యమ చర్యలు గమనించనపుడు
ఆ కలివిడి – ఆ సందడి- అనుభవైక వేద్యమేమొ
పదిహేడొందల రోజుల పయనపు సాంగత్యమేమొ!

  -నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
శుక్రవారం – 21/06/2019
చల్లపల్లి.

14.02 కు పెట్రోలు బంకు వద్ద విజయవాడ రోడ్డు లోMrng (1)పూడిపోయిన డ్రైన్ లో పూడిక తీస్తున్నారుMrng (2) Mrng (5) Mrng (6) Mrng (7) Mrng (8) Mrng (14) Mrng (16)Wall Paints (4)Wall Paints (3)సంత మార్కెట్ గోడకు ప్రయమరీ రంగు వేస్తున్నారుWall Paints (6)Stones (1) Stones (4)ఆసుపత్రి రోడ్డులో రద్దు ఎత్తుతున్నారుWall Paints (2)Drain (1) Drain (2) Drain (3)డ్రైన్ లో దిగి శుభ్రపరుస్తున్న కార్యకర్త1 (4) 1 (10) 1 (12) 1 (16) 1 (21) 1 (22) 1 (23) 1 (25) 1 (28)Scrapసంత బజారులో పోగు పెట్టిన కూరగాయల చెత్త1 (5)శ్రీమతి గోళ్ల రాజేశ్వరి గారు, గంధం వేంకటేశ్వర రావు గారి విరాళాన్ని అందిస్తున్న గోళ్ళ వెంకట రత్నం గారు1 (13) 1 (29)కార్యక్రమానంతరంNRN Groupనారాయణ రావు నగర్ కార్యక్రమాలుNRN (2) NRN (3) NRN (4)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *