స్వచ్ఛ సుందర చల్లపల్లి – 22/06/2019 (1684* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1684*వ నాటి విశేషాలు.

నేటి ఉషోదయం 4.08-6.20 నిముషాల మధ్య (25+5+5+8) 43 మంది గ్రామ సేవాధురీణులు చల్లపల్లికి 5 రకాల సేవలందించారు.

1) 6 వ నంబర్ కాల్వ సమీపంలోని విజయవాడ మార్గం, వంతెన దగ్గర డ్రైను లోని వ్యర్ధాలను తొలగించి, నాళం వాసు గారి మునక తోట కంచె లోపలి పిచ్చి-ముళ్ల మొక్కల్ని నరికి, ప్లాస్టిక్ సంచులు, పాత గుడ్డలు, ఎండుటాకులు, ఏరి-ఊడ్చి-ట్రాక్టర్ కెత్తి ప్రధాన చెత్త కేంద్రానికి చేర్చారు.

2) సుందరీకరణ బృందం చేతిలో సంత ప్రహరీల పూర్తి అందాల కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

3) గ్రామ పరిరక్షణ దళం (రెస్క్యూ టీమ్) గంగులవారిపాలెం దారిలోని రంగు రాళ్లను అందంగా పేర్చారు.

4) వీరు కాక కొందరు ట్రస్టు ఉద్యోగులు నిరంతరంగా నీళ్లందిస్తూ ఊరి మొక్కల పచ్చదనాన్ని పెంచుతున్నారు.

5) నారాయణరావు నగర్ స్వచ్ఛ వీరులు 644* వ నాటి గ్రామ సేవలు కొనసాగించారు.

రేపటి స్వచ్చంద సేవల కోసం 6వ నంబర్ కాలువ దగ్గరే కలుద్దాం.

పద్మావతీ హాస్పిటల్ లాబొరేటరీ ఉద్యోగి రవి ముమ్మారు నినదించిన స్వచ్ఛ సుందర సంకల్పంతో కార్యకర్తలు గొంతులు కలిపి, 6.40కి నేటి స్వచ్ఛ సేవలు ముగించారు.

*ఆలోచన అద్భుతం*.
భజన లేల చల్లపల్లి స్వచ్ఛ ఉద్యమానికి?
సృజనాత్మక సేవల విస్తృతి కావలె దానికి
ప్రచారాల- ప్రలోభాల వ్యామోహం కన్నా
ప్రజారోగ్య పరిరక్షణ భావన కడు మిన్న!

  -నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
శనివారం – 22/06/2019
చల్లపల్లి.

14.08 కు 6వ నెంబరు కాలువ వద్దMrng (1) Mrng (2) Mrng (3) Mrng (4) Mrng (5) Mrng (6) Mrng (7) Mrng (8)Mrng (10)Stones (2) Stones (3) Stones (4)Wall Paints (6) Wall Paints (8) Wall Paints (9)1 (27) 1 (30)1 (1) 1 (2) 1 (3) 1 (5) 1 (6) 1 (8) 1 (9) 1 (12)1 (15) 1 (16) 1 (17) 1 (21) 1 (26) 1 (28) 1 (29) 1 (32) 1 (34) 1 (35) 1 (36)1 (13) 1 (31)కార్యక్రమానంతరంNRN Groupనారాయణ రావు నగర్ కార్యక్రమాలుNRN (2) NRN (3) NRN (4)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *