స్వచ్ఛ సుందర చల్లపల్లి – 23/06/2019 (1685* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1685*వ నాటి విశేషాలు.

ఈ ఆదివారం వేకువ 4.01-6.30 గం.ల మధ్య (25+6+5+8) 44 మంది స్వచ్చోద్యమ కార్యకర్తల బహుముఖ సేవలు ఈ గ్రామానికి దక్కినవి.

1) 6 వ నంబరు పంట కాల్వను, గట్లను, పరిసరాలను విజయవాడ దారి వంతెన నుండి నారాయణరావునగర్ వైపుకు కొంత మేర ప్లాస్టిక్ సంచుల్ని, ఖాళీ మద్యం సీసాలను, ఎండు ఆకులు, కొమ్మలు, ఎంగిలాకులు ఏరి – ఊడ్చి – గుట్టలు చేసి, ట్రాక్టరు కెత్తి చెత్త కేంద్రానికి చేర్చడం, కుడి వైపు దారి ప్రక్కల పిచ్చి ముళ్ళ మొక్కలు తొలగించడం నేటి ప్రధాన కృషి.

2) సుందరీకరణ నిబద్ధులు సంత గోడల పై జాతి పిత చిత్రాన్ని, పూల తీగలను చెక్కారు. బస్ ప్రాంగణం, శ్మశానాల వలెనే త్వరలో సంత బజారు కూడ గ్రామస్తులను ఆకర్షించబోతున్నది.

3) కోమలా నగర్ లోని మట్టిని సంత బజారు మార్జిన్ గుంటలో సర్ది, రోడ్ల పరిరక్షక బృందం తమ నిబద్ధతను చాటింది.

4) ‘మనకోసం మనం’ ట్రస్టుకు చెందిన రాధాకృష్ణ బృందం గ్రామంలోని వేలాది మొక్కలకు నీరందించింది.

5) నారాయణరావు నగర్ కార్యకర్తల సుదీర్ఘ సేవలు నేడు 644* వ రోజు

ధ్యాన మండలి వారు నేటి కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యకర్తల కాఫీ సేవన సమయంలో వక్కలగడ్డ నుండి వచ్చిన R.M.P వైద్యుడు నాగశేషు, MPTC మాజీ సభ్యులు ఆత్కూరు శివప్రసాదులు స్వచ్చోద్యమ ప్రేరకమైన పాటలు పాడారు.

పద్మావతి ఆసుపత్రి రిసెప్షనిస్ట్ లక్ష్మి సెల్వం పప్పుండలను, దేసు మాధురి గారు మామిడి పళ్లను కార్యకర్తలకు పంచారు.

పెదకళ్లేపల్లి నుండి వచ్చి, స్వచ్చ సేవలో పాల్గొంటున్న విద్యార్ధి ప్రణీత్ స్వచ్చోద్యమ నినాదాలతో ముమ్మారు గొంతు కలిపిన కార్యకర్తలు 6.45 కు నేటి సేవలకు స్వస్తి పలికారు.

రేపటి స్వచ్చంద సేవ కోసం సెంటర్ లో కలుద్దాం.

     *వచ్చి తీరును మంచిరోజులు*
ఒక విశాల దృక్పధంతో – ఒకరికొకరుగ – అందరొకటిగ
ఒక ప్రశాంత స్ధిర ప్రణాళిక తోనె జన సంక్షేమ కదలిక
సమస్త గ్రామ స్వస్తతే గద స్వచ్చ సైన్యం నేటి కోరిక
స్వచ్చ సుందర చల్లపల్లికి వచ్చి తీరును మంచి నాళ్లిక!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
ఆదివారం – 23/06/-2019
చల్లపల్లి.

14.01 కు  6 వ నెంబరు కాలువ వద్ద 1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (6) 1 (7)Paint (3) Paint (7) Paint (10) Paint (11)Paint (5) Paint (2) Paint (4)పల్లపు ప్రాంతాలలో మట్టిని సర్దుతున్న కార్యకర్తలు
Paint (6) Paint (8) Paint (12) Paint (1) Paint (9)04ae2e3f-1dcf-4ee3-ad0a-0499d6d7666aProg (1) Prog (2)6 వ నెంబర్ కాల్వ వద్ద శుభ్రం చేస్తున్న కార్యకర్తలు
Prog (3) Prog (4) Prog (5) Prog (6) Prog (7) Prog (8) Prog (9) Prog (10) Prog (11) prog4ceebfb2-7ee0-4dbd-920e-c8fc47c7e136Last (1) Last (4)అందంగా ఉన్న విజయవాడ రోడ్డLast (5)

NRN Groupనారాయణరావు నగర్ కార్యకర్తలు
NRN (1) NRN (2)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *