స్వచ్ఛ సుందర చల్లపల్లి – 24/06/2019 (1686* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1686*వ నాటి కబుర్లు.

ప్రతి సోమవారం లాగే ఈ వేకువ 4.01-6.04 నిముషాల మధ్య (27+3+9) 39మంది గ్రామ సేవకులు చల్లపల్లి సెంటర్ నుండి మూడు మార్గాలలో స్వచ్చ కృషి కొనసాగించారు.

దుమ్ము, వరి ఊక, ప్లాస్టిక్ సంచులు, చిత్తు కాగితాలు, ఎంగిలాకుల పొట్లాలు వంటివి ఊడ్చి-ఏరి- ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి తరలించారు. వీరి జాగరూకతతో, ముఖ్యమైన దారులన్నీ పరిశుభ్రంగా ఉంటున్నవి. ప్రధాన వీధుల గోడలకు అంటిస్తున్న వివిధ రకాల పోస్టర్లు, ఎన్నికలు ముగిసిన 80 రోజుల తర్వాత కూడా తొలగించని ఫ్లెక్సీలు మాత్రం చూపరులకు అసంతృప్తిగా ఉంటున్నవి.

కొందరు సెంటరు లోని రోడ్ల గుంటలను రాతి ముక్కలతో పూడ్చారు. ధ్యాన మండలి వారు నేడు కూడా సేవలందించారు. ఇంకా వానలు పడకపోవడంతో నీళ్ల టాంకరుతో ట్రస్టు ఉద్యోగులు మొక్కలకు నీరందించారు.

షాబుల్ వీధిలో కొందరు విద్యార్ధులను కలుపుకొని గత 9 ఆదివారాలలో షాబుల్ గారి తమ్ముడు, ఉరిమి శాయి గారు, పల్నాటి స్వచ్ఛ వీరులు మిగిలిన వార్డుల కాదర్శవంతమైన వీధి సేవలందిస్తున్నారు.
నారాయణరావు నగర్ కార్యకర్తల శ్రమ దానానికి మూడు రోజులు విశ్రాంతి.

గ్రామమంతా మారు మ్రోగేలా కోడూరు వేంకటేశ్వర రావు గారి స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలకు కార్యకర్తలు గొంతులు కలపడంతో 6.40కు నేటి స్వచ్ఛ సేవలకు స్వస్తి.

రేపటి గ్రామ శుభ్రతా కృషి బైపాసు మార్గంలోని కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రి శిధిలాల మధ్య.

 *చరిత్ర పుటలలో*.
మధ్యందిన మార్తాండుని మరో రూపు స్వచ్ఛ సేన
వికసించిన విద్యుల్లత విహారిమీ స్వచ్ఛ సేవ
ఇది చిరాయువై సేవల విస్తృతి కొనసాగదా!
స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత పుటల కెక్కదా!

  -నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
సోమవారం – 24/06/-2019
చల్లపల్లి.

14.03 కు సెంటెర్లోMrng (10) Mrng (3) Mrng (6) Mrng (11) Mrng (12)Mrng (14) Mrng (15) Mrng (17) Mrng (20) Mrng (22) Mrng (23) Mrng (29) Mrng (21)Mrng (7)శుభ్రం చేయక ముందుMrng (24)తారు రోడ్డు పై వున్న గుంటను పూడ్చిన కార్యకర్తలుMrng (8) Mrng (32)Mrng (19) Mrng (26) Mrng (27)Mrng (4)శుభ్రం చేయక ముందుMrng (5) Mrng (31)శుభ్రం చేసిన తరువాత Mrng (38)

Mrng (33) Mrng (30)1 (2) 1 (1) 1 (4) 1 (10) 1 (11)1 (7) 1 (5)కార్యకర్తల శ్రమతో పరిశుభ్రంగా ఉన్న బందరు రోడ్డు1 (8) 1 (12) 1 (13)

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *