స్వచ్ఛ సుందర చల్లపల్లి – 15/07/2019 (1707* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1707* వ నాటి సేవా విశేషాలు.

నేటి ఉషోదయంలో 4.42 – 6.10 మధ్య(17+4)21 మంది స్వచ్ఛ సుందర గ్రామ సేవకులు తమ సొంత ఊరి బాధ్యతలను నెరవేర్చారు.

– పెను ఈదురు గాలులతో గూడిన భారీ వర్షం వలన నేటి సేవల రంగం సంత నుండి గ్రామ ప్రధాన కూడలికి మారింది. సిల్టు, చెత్త నిండి, ఈ రెండు రోజుల వాన మూలంగా మురుగు ఎదురు తన్ని, రోడ్లపై చేరి, బాగు చేసే కార్యకర్తల కోసం ఎదురుచూస్తున్నవి.

– పొట్టి శ్రీ రాములు వీధి మొదట, నాగాయలంక రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద, బందరు రోడ్డు మొదట, అడ్డంకుల్ని తొలగించి, లోతైన డ్రైన్లలో దిగి, ప్లాస్టిక్ సంచుల్ని, ప్లాస్టిక్ సీసాలు, కప్పులను, ఆకులు, మురుగు సిల్టు, అనేక వ్యర్ధాలను చేతులతో లాగి, తోడి, ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి తరలించిన తర్వాతే, నీరు తగ్గి, ఆరెండు రహదారుల ఉనికి వాహన దారులకు, పాదచారులకు తెలిసి వచ్చింది!

– అలనాడు రోమన్ ప్రజల పాపాల శిలువను మోసిన క్రీస్తు మహాశయుడే- ప్రతి వర్షా కాలంలోను మురుగు పనులను నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలలో నాకు కనిపిస్తునాడు.

– మహిళా కార్యకర్తలతో సహా కొందరు రహదారులను శుభ్రపరిచారు.

– రోజూ ముమ్మరంగా జరిగే సుందరీకరణ పనులకు నేడు విరామం.

– నారాయణ రావు నగర్ లోని నిరాటంక సేవలకు 666* వ రోజు.

ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి ఉద్వేగ భరిత స్వచ్ఛ సంకల్ప నినాదాలకు బదులిచ్చిన స్వచ్ఛ కర్మ వీరులు నేటి గ్రామ సేవలను 6.40నిముషాలకు ముగించారు.

రేపు వర్షం లేకుంటే సంత దగ్గర, ఉంటే ప్రధాన కూడలి దగ్గర మన సేవలు కొనసాగిద్దాం.

 మార్పు కోసం జైత్ర యాత్రలు.
వందలాదిగ- వేన వేలుగ- వచ్చి రోజులు పోవుచున్నవి
ఎవరి కోసం స్వచ్ఛ సేవలొ వారిలో ఏ మార్పులున్నవి?
ప్రతిఫలాపేక్ష లేకుండా గ్రామ సౌఖ్యమె ఆశయంగా
స్వచ్ఛ వీరుల జైత్ర యాత్రలు సాగె నీ ఐదేళ్ల నుండీ!

– నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు
సభ్యులు – మనకోసం మనం ట్రస్టు
సోమవారం – 15/07/2019
చల్లపల్లి.

14.42 కు సెంటెర్లో కరీముల్లా dresses వద్దMrng (1) Mrng (3)డ్రైన్ శుభ్రం చేయకముందు
కారీబాగులు, సీసాలు, ప్యాకెట్లు తో నిండిపోయిందిMrng (4) Mrng (6) Mrng (7) Mrng (8) Mrng (9) Mrng (14) Mrng (17)పెట్రోలు బంకు వద్ద డ్రైన్ శుభ్రం చేస్తున్నారుMrng (18) Mrng (20)Mrng (10)తవ్వగా బయటపడ్డ తూముMrng (16)డ్రైన్ పై బస్తాలు పెట్టడం వలన డ్రైన్ శుభ్రం చేయుటకు వీలు కాలేదు 1(23)వర్షపు నీళ్ళతో నిండిన  3 రోడ్ల సెంటెర్Mrng (19)చెత్త బుట్ట ఉన్నా కానీ నేల మీదే తాగిన టీ కప్పులను పడవేస్తున్నారు.1 (9)1 (2)బస్టాండ్ వద్ద కోట గోడ మూల నిలిచిపోయిన వర్షపు నీళ్లను డ్రైన్ లోకి పంపడానికి ప్రయత్నిస్తున్న కార్యకర్తలు1 (4) 1 (6) 1 (8)పెట్రోల్ బంక్ వద్ద డ్రైనేజి ని శుభ్రం చేస్తున్న కార్యకర్తలు1 (3) 1 (7) 1 (11) 1 (14) 1 (16) 1(21)1 (1) 1 (5)1 (19)NRN Groupనారాయణ రావు నగర్ కార్యక్రమాలుNRN (1) NRN (2) NRN (3) NRN (4) NRN (6)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *