స్వచ్ఛ సుందర చల్లపల్లి – 16/07/2019 (1708* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1708* వ రోజు విశేషాలు.

ఈ మంగళవారం ఉషోదయం 4.08 – 6.05 మధ్య(27+8)35 మంది చిన్న, పెద్ద స్వచ్ఛ సైనికుల ద్విముఖ సేవలు చోటుచేసుకున్నవి.

– సంత ప్రహరీలు, రేకులు షెడ్డులు, రెండు పక్కా కట్టడాలు-అన్నీ వర్ణ రంజితాలుగా మార్చిన కార్యకర్తలు ఈ రోజు అక్కడి కరెంటు స్తంభాలను కూడా అలంకరించారు. ఏడెనిమిది మంది ఈ పనిలో ఉండగా, నలుగురైదుగురు రెండవ ముఖద్వారం దగ్గర స్వచ్ఛ కార్మికుడైన జాతిపిత చిత్రాన్ని, సంత యొక్క స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలను సందర్శించమటూ స్వాగతాంజలి పట్టిన సుందరి బొమ్మను చిత్రించారు.

– దక్షిణపు గోడ మీద భావస్ఫోరకంగా ” దైదీభావ వృక్ష సుందరి” ని అలంకరిస్తూ ఇద్దరు మహిళా కార్యకర్తలు బుర్రలకు పదును పెట్టారు.

– నిన్నటి వార సంత కూరల అవశేషాలను, రైతు బజారు ముందరి దుర్గంధ వ్యర్ధాలను కొందరు కార్యకర్తలు ఊడ్చి పోగులు పెడుతూ నలుగురైదుగురు స్వచ్ఛ కృషిలో నిమగ్నులయ్యారు.

– సంత ప్రక్క నీళ్ల టాంకుల ఆవరణ ప్రహరీలకు రంగులు వేసే కార్య దీక్షలో కొందరు కనిపించారు.

– స్వచ్చోద్యమానికింకా దూరంగానే ఉన్న కొందరు గ్రామస్తులు ముఖ్యంగా ముఖ పుస్తకంలో, వాట్సాప్ లో, దిన పత్రికలలో చదువరులు చల్లపల్లి స్వచ్ఛ సైనికులు 3.30 కు ముందే లేచి, నాలుగున్నరకు ముందే పై పనులన్నీ చేస్తారంటే నమ్మలేకపోవచ్చు గాని, ఐదేళ్లుగా నిత్య కృత్యమై పోయిన కార్యకర్తలకిది చాలా చిన్న పని!

– పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో సంతకు ఒక ప్రక్క గేట్లు అమర్చారు.

– మొన్న వరుసగా 12 వ ఆదివారం కూడ షాబుల్ వీధిలో స్వచ్ఛ కార్యక్రమం జరిగింది.

– గురు పౌర్ణమి పూజలకై స్వచ్ఛ కార్యకర్తలందరినీ శివబాబు గారు ఆహ్వానించారు.

– నారాయణరావు నగర్ లోని గ్రామ సేవలు 667* వ రోజు కొనసాగినవి.

పంచాయతీ E.O బొల్లిముంత ప్రసాద్ గారు చెప్పిన స్వచ్ఛ సంకల్ప నినాదాలతో 6.40 నిముషాలకు నేటి గ్రామ సేవల పరి పూర్తి.

 వర్షం వస్తే కరీముల్లా డ్రస్సెస్ దగ్గర, లేకుంటే సంత వద్ద రేపటి మన సేవా విధులకు హాజరౌదాం.

కర దీపం
అనూహ్యం ఈ చల్లపల్లి లొ స్వచ్ఛ సేవల విశ్వ రూపం
అద్భుతం పదిహేడు వందల అహోరాత్రుల స్వచ్ఛ దీపం
కార్యకర్తల స్వచ్ఛ సంస్కృతి – గ్రామ భావితమ్యుల దివిటీ-
స్వచ్ఛ సుందర జైత్ర యాత్రలు సాగె నీ ఐదేళ్ల నుండీ!
– నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు
సభ్యులు – మనకోసం మనం ట్రస్టు
మంగళవారం – 16/07/2019
చల్లపల్లి.

14.08 కు సంతలోMrng (2) Mrng (6) Mrng (10) Mrng (12) Mrng (13) Mrng (14) Mrng (15) Mrng (17)Mrng (4) Mrng (18)Mrng (14)Mrng (19)Mrng (8) Mrng (16)Mrng (9)Mrng (1)Wall Paints (25) Wall Paints (11) Wall Paints (4)Wall Paints (1)Wall Paints (6) Wall Paints (16) Wall Paints (5) Wall Paints (3)Wall Paints (27) 1 (12) Wall Paints (15) Wall Paints (18) 1 (7) 1 (6)Wall Paints (12) Wall Paints (23)Wall Paints (13)64774dbb-6c94-4ccc-91e8-faef9a259e18నాడు1 (13) Wall Paints (21)నేడుWall Paints (22)1 (2) 1 (3)Wall Paints (9)NRN Groupనారాయణ రావు నగర్ కార్యక్రమాలుNRN (1) NRN (2) NRN (4) NRN (5) NRN (6)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *