స్వచ్ఛ సుందర చల్లపల్లి – 17/07/2019 (1709* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

                                        స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1709* వ దినం విశేషాలు.

వానతెరపి ఇవ్వడంతో నేటి వేకువ 4.06 – 6.05 మధ్య (29+7) 36 మంది స్వచ్చంద గ్రామ సేవకులు రైతుబజారు, సంత ప్రాంతంలో, నారాయణరావునగర్ లో చల్లపల్లి శుభ్రతకు అంకితులయ్యారు.

– సంతబజారులో ఐదారుగురి స్వచ్ఛ చర్యలు జరుగగా, ఎక్కువ మంది సంతలోపలి షెడ్డులలో, ప్రహరీల పైన ఏకొంచెం చోటు మిగిలినా సుందరీకరణ ప్రయత్నంలో నిమగ్నులయ్యారు.

– దక్షిణ ప్రహరీ గోడ మీద “వృక్ష సుందరి” కి ఇద్దరు కళాకారిణులు మరిన్ని సొబగులు దిద్దారు.

– 7 గురు కార్యకర్తలు నీళ్ళ టాంకుల ప్రహరీలకు రంగు పూసే దీక్షలోను, నలుగురైదుగురు ముఖ ద్వారం ప్రక్కన నిన్నటి చిత్రాలకు మెరుగులు దిద్దుతూ, మరో నలుగురు మత్స్యభవనానికి, కరెంటు స్తంభాలకు రంగులు దిద్దుతూ ఆనందిస్తున్నారు.

– అక్కడ నారాయణరావునగర్ లో 668*వ నాడు నిర్విఘ్నంగా గ్రామసేవలు జరుగుతున్నవి.

దీనర్ధం ఏమంటే – స్వచ్చ సైనికులంటే – మురుగు పారిశుద్ధ్య కార్మికులు, రోడ్ల దుమ్ము, చెత్త ఊడ్చి ఎత్తేవారు, శ్మశానాల – బస్ ప్రాంగణాల – కర్మ భవనాల – రహదారుల స్వచ్చ – సుందర – ఆరోగ్య చల్లపల్లి రూపశిల్పులన్నమాట!

– లయన్స్ క్లబ్ ప్రతినిధిగా అధ్యక్షులు శ్రీ టి. సాంబశివరావు గారు నేటి సేవలో పాల్గొన్నారు.

దుబాయి నుండి వచ్చిన దాసరి స్నేహ (‘మనకోసం మనం’ సంస్థ బాధ్యుల్లో పిన్నవయస్కురాలు) నేటి స్వచ్చ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, సంత బజారు ప్రక్క వేయబోతున్న పేవర్ టైల్స్ ఖర్చుల నిమిత్తం 2,00,000/- (రెండు లక్షలు) విరాళం ప్రకటించినందుకు స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు. చెక్కును రేపు అందజేయనున్నారు.

సమధికోత్సాహంతో స్నేహ ముమ్మారు పలికిన స్వచ్చ సంకల్ప నినాదాలకు కార్యకర్తలు బదులివ్వడంతో 6.45 నిముషాలకు నేటి గ్రామ సేవల వేడుక ముగిసింది.

రేపటి మన బాధ్యతల కోసం సంత దగ్గరే కలుద్దాం.

               నిత్య సేవల సంబరాలివి
ప్రముఖులందరి ప్రోద్బలంతో – సుముఖులిందరి స్వాగతంతో
భిన్న ధృవముల ఆదరంతో – పిన్నపెద్దల సంబరంతో
దాతలెందరో సహకరించగ – నేతలూ చేయూతనీయగ
చల్లపల్లి లొ నిత్య సేవల సంబరం ఐదేళ్ళ నుండీ!

– నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు
సభ్యులు – మనకోసం మనం ట్రస్టు
బుధవారం – 17/07/2019
చల్లపల్లి.

14.06 కు సంతలో3b2cad46-8608-4add-815e-0c78dc7ad2f9రంగులు కలుపుతూ0970c18f-c20d-4f22-904b-5f36d417a9cb154d6d77be-0436-4da6-9508-bb4e4cf8c26819852b324f-3b50-425f-aced-5179fa7b14c581c25fc9-5a6a-4b2c-91bb-242899a774f043b26f99-da3f-4259-b523-ac6191023ce5262740987b9916-46ba-4233-84cf-22ea6733d96012281314173318202223290b2cc26a-6b9f-4248-a110-458f7b2adaf3టాంకు ప్రహరీ గోడలకు రంగులు వేస్తూ32

36

37

38Dasari sneha

39

34

2d16d8a8-b1a5-46bd-b72f-60a67237ff57 17b8929e-c412-4f6a-8d6b-2c2e2b787ba9 75ec27b5-c738-4ab0-bf46-0463c41a3452 8077bf6a-0971-4db3-bc56-8ac3a666064d b372be7b-0640-4ecc-b43a-4701eef40a12NRN Groupనారాయణరావునగర్ కార్యక్రమాలుa036c408-3485-4f7e-8046-75e3a9c5dc57 bcfa2a3e-6ea0-4896-a6f3-2068dba11250

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *