స్వచ్ఛ సుందర చల్లపల్లి – 29/07/2019 (1721* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1721* వ నాటి కబుర్లు.

రోడ్ల రక్షణ, శుభ్రతల ఆనవాయితీకి భిన్నంగా నేటి వేకువ 4.07 –  6.05  నిముషాల మధ్య 24  మంది స్వచ్ఛతా ప్రియులు తమ మాతృభూమి కవసరమైన సేవలందించారు.

– మేకల డొంక నుండి శివరామపురం దారిలో కొందరు రెండు ప్రక్కలా రాలి పడిన తాడి పండ్లను, పెరిగిన నిరర్ధకమైన ముళ్ల- పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ సంచుల్ని, ఇతర వ్యర్ధాలను ఏరి- నరికి-పోగులు చేసి, ట్రాక్టర్ కెత్తి డంపింగ్ కేంద్రానికి చేర్చారు.

– గతంలో నాటి, పెంచిన మొక్కల పాదుల్ని సరి జేసి, అవసరమైన మేర రక్షణ కల్పించి మరికొందరు కృషి చేశారు.

– ఖాళీ లను వెదకి కొందరు క్రొత్తగా పాదులు తీసి, 85 బోగన్ విలియా మొక్కల్ని నాటరు.

– గతంలో బిళ్ల గన్నేరు పల్లిగా మారిన చల్లపల్లి ఇక ముందు ‘బోగన్ విలియా పల్లి’ గా మారబోతున్నది. స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమ ఫలించి, గ్రామ ప్రవేశక రహదారులికపై రంగు రంగుల పూలతో కనువిందు చేయబోతున్నవి.

స్ఫూర్తి దాయకమైన కోడూరు స్వచ్ఛ కార్యకర్తల గ్రామ సేవల 50* రోజుల పండుగ నిన్న విజయ వంతంగా జరగటం ముదావహం.

స్వల్ప విరామం తర్వాత ఈ నాటి స్వచ్చంద సేవలో పాల్గొన్న అడపా గురవయ్య ప్రయోజనకరమైన జీవన సత్యాలను వివరించడమే కాక స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను మూడు మార్లు గట్టిగా పలికి, నేటి గ్రామ సేవకు స్వస్తి పలికారు.

రేపటి మన బాధ్యతా నిర్వహణకై శివరామపురం గుడిసెల దగ్గరి పంట కాలువ వంతెన వద్ద కలుసుకుందాం.

           

   సంకల్పమె సగం బలం.

ఆరంభం అతి చిన్నది  స్వచ్ఛ ఉద్యమానికి

అది నేడొక వట వృక్షం  అన్ని దెసల ఊళ్లకి

సంకల్ప బలం దొడ్డది స్వచ్ఛ చల్లపల్లికి

సామాజిక సామూహిక స్వచ్ఛ ప్రయాణానికి!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 29/07/2019

చల్లపల్లి.

14.07 కు మేకలడొంక వద్దMrng (1) Mrng (2) Mrng (3) Mrng (4)Mrng (6) Mrng (7) Mrng (8) Mrng (9) Mrng (10)1 (1)మేకలడొంక drain లో చెత్త1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (7) 1 (8) 1 (9) 1 (10) 1 (11)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *