స్వచ్ఛ సుందర చల్లపల్లి – 30/07/2019 (1722* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1722* వ నాటి వార్తలు.

నేటి శుభోదయ గ్రామ సేవలో 31 మంది కృత కృత్యులయ్యారు. 4.15 –  6.15  మధ్య సమయంలో….

1) బందరు మార్గంలో , 2) శివరామపురం రహదారిలో ద్విముఖంగా సాగిన ఈ స్వచ్ఛ కార్మికుల శుభ్ర- సుందరీకరణ ప్రయత్నం నాలాంటి వారికి సంభ్రమాశ్చర్యకరం.

– ట్రాక్టర్ డ్రైవర్ తో సహా ఐదుగురు బందరు దారి ప్రక్క డ్రైను పై కప్పు రాతి పలకల వ్యర్ధాలను ట్రాక్టర్ లో కెత్తి, డంపింగ్ కేంద్రం దగ్గరి రోడ్డు పై పరచి స్వచ్ఛ సేవను ఒక సదుత్పాదక చర్యగా మార్చారు.

– 15 మంది శివరాంపురం మార్గంలో మూడేళ్ల క్రితం నాటి పెంచిన  మొక్కలకు పాదులు సరిజేసి, కలుపు పీకి దాదాపు 200 గజాల మేర దర్శనీయస్థలంగా మార్చివేశారు.

– మరికొందరు రోడ్డు పైనా, ప్రక్క చేలలోనా రాలిపడిన తాడి పండ్లను, ఎండు టాకుల్ని ఏరి, రోడ్డు ను ఊడ్చి, వ్యర్ధాలను ట్రాక్టర్ తో చెత్త కేంద్రానికి తరలించారు.

– మేకల డొంక- పంట కాలువ మధ్య నేటి స్వచ్ఛ కార్యకర్తల సేవలను, గత మూడు నాలుగేళ్ల స్వచ్చోద్యమ ప్రస్థానాన్ని, తన తల్లిదండ్రుల  స్వచ్ఛ సుందర భావనల వ్యత్యాసాన్ని గురించి,”మనకోసం మనం ట్రస్టు” సభ్యురాలైన దాసరి స్నేహ చేసిన వివరాణాత్మక- ప్రేరణాత్మక- విశ్లేషణను కార్యకర్తలు కరతాళ ధ్వనులతో స్వాగతించారు.

అత్యుత్సాహపరుడైన కార్యకర్త అంజయ్య గారు ఉద్విగ్నంగా చెప్పిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలకు కార్యకర్తలంతా దీటుగా స్పందించి, 6.40 నిముషాలకు నేటి తమ బాధ్యతలు ముగించారు.

రేపటి స్వచ్ఛ -శుభ్ర-సుందరీకరణ కోసం శివరామపురం మార్గంలోని పంట కాలువ వంతెన దగ్గర కలుసుకుందాం.

         

   సుందరయ్యల మేటి స్వర్గం.

స్వచ్ఛ సుందర మేటి సేవకు సాహసించిన స్వచ్ఛ సైన్యం

ఊరికై సృజనాత్మకంగా ఉద్యమించే వర్తమానం!

ప్రజల కోసం- ప్రజల మధ్యే పాటు బడు ఈ రాచమార్గం

సుందరయ్యలు-బాపనయ్యలు చూపి పోయిన మేటి స్వర్గం!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 30/07/2019

చల్లపల్లి.

14.15 కు శివరాంపురమ్ వద్దMrng (1) Mrng (12) Mrng (17)రద్దు ,రాళ్లు ఎత్తుతున్న రెస్క్యూటీమ్Mrng (2) Mrng (5)Mrng (10) Mrng (11) Mrng (14) Mrng (15) Mrng (16) Mrng (19) Mrng (20)

Mrng (18)

Mrng (8)శుభ్రం చేయక ముందు1 (38)కార్యకర్తల శ్రమతో శుభ్రంగా ఉన్న రోడ్డు1 (1) 1 (4) 1 (7) 1 (14) 1 (15) 1 (21)1 (5) 1 (8) 1 (9)1 (25)1 (23)1 (10)మొక్కలకు పాదులు చేస్తున్నారు1 (11) 1 (12) 1 (13) 1 (18) 1 (22) 1 (29) 1 (30) 1 (32) 1 (33) 1 (35) 1 (36) 1 (37)మొక్కలచుట్టుశుభ్రం చేసి పాదులు తీస్తున్న సుందరబృందం
1 (39) 1 (42) 1 (43)కలుపు తీసిన తరువాత కనిపిస్తున్న పూలు1 (44) 1 (46)1 (17)కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న మనకోసం మనం ట్రస్టు సభ్యురాలు దాసరి స్నేహ1 (26) 1 (45)

1 (24)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *